Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Updated on: Jul 30, 2022 | 4:37 PM

అప్పుడప్పుడూ మనుషుల్లాగానే ఒకేజాతికి చెందిన జంతువులు కూడా పోట్లాడుకుంటుంటాయి. తాజాగా ఇంటర్నెట్‌లో రెండు పిల్లుల మధ్య జరిగిన ఫైట్‌ వైరల్‌ అవుతోంది.


అప్పుడప్పుడూ మనుషుల్లాగానే ఒకేజాతికి చెందిన జంతువులు కూడా పోట్లాడుకుంటుంటాయి. తాజాగా ఇంటర్నెట్‌లో రెండు పిల్లుల మధ్య జరిగిన ఫైట్‌ వైరల్‌ అవుతోంది. ఇందులో ఓ సూపర్‌ ట్విస్ట్‌ కూడా ఉంది.. అది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వాహనాల రద్దీ ఉండే రోడ్డుపైకి రెండు పిల్లులు వచ్చాయి. ఉన్నట్లుండి ఒకదానిపై ఒకటి దాడికి దిగాయి. గుర్రుమంటూ పొట్టు పొట్టుగా కొట్టున్నాయి. అయితే, ఇక్కడే ఒక ఫన్నీ మూమెంట్ చోటు చేసుకుంది. రెండు పిల్లులు తన్నుకుంటుంటే.. మధ్యలో ఓ కాకి దూరింది. కొట్టుకుంటున్న రెండు పిల్లుల్లో ఒకదానిపై అటాక్ చేసింది కాకి. అలా.. వాటి గొడవను ఇది ఛాన్స్‌గా తీసుకుని ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పిల్లుల గొడవ, కాకి రచ్చను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 30, 2022 04:37 PM
Loading...
Unable to load recommendations.
Follow Us