Car Accident:వీడికి భూమ్మీద ఇంకా నూకలున్నాయి.. వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు.. కళ్ళు చెదిరే వీడియో..

Updated on: Jul 19, 2022 | 10:02 AM

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటిలో కొంతమంది తీవ్రంగా గాయపడతారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.


ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటిలో కొంతమంది తీవ్రంగా గాయపడతారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రోడ్డుపై వాహనదారులేకాదు, పాదచారులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ భయానక ప్రమాదం నుంచి ఓ డ్రైవర్‌ వెంట్రుకవాసిలో తప్పించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఈ వీడియోలో రెండు వాహనాలు ఒకదానికొకటి భయంకరంగా ఢీకొన్నాయి. రెండు వాహనాలు బాగా డామేజ్‌ అయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ఓ వాహన డ్రైవర్‌ హఠాత్తుగా రోడ్డుమీద పడిపోయాడు. అయినా అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. పైగా ప్రమాదం జరిగిన వెంటనే లేచి చుట్టుపక్కల చూస్తూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. అయితే మరో వాహనంలో ఉన్నవారు కూడా స్వల్పగాయాలతో బయటపడి ఉంటారని తెలుస్తోంది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి ‘హిట్ అండ్ రన్’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. కేవలం 13 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతటి భయానక యాక్సిడెంట్‌ నుంచి బయటపడ్డ ఆ డ్రైవర్‌కు ఇంకా భూమ్మీద నూకలున్నాయంటూ ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 19, 2022 10:02 AM
Loading...
Unable to load recommendations.
Follow Us