Morphing photos: బీటెక్‌ స్టూడెంట్స్‌ మార్ఫింగ్‌ న్యూడ్‌ ఫోటోల కలకలం..! యాజమాన్యానికి వ్యతిరేకంగా…

|

Jan 16, 2023 | 9:19 AM

హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్‌లోని విజ్ఞాన్‌భారతి ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థినుల న్యూడ్‌ ఫొటోలు కలకలం రేపాయి. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్‌ చేసిన కొందరు ఆకతాయిలు వాటిని వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేశారు.


హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్‌లోని విజ్ఞాన్‌భారతి ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థినుల న్యూడ్‌ ఫొటోలు కలకలం రేపాయి. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్‌ చేసిన కొందరు ఆకతాయిలు వాటిని వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేశారు. అంతేకాదు వాటి ఆధారంగా వేధింపులకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థినులు కాలేజ్‌ ముందు ధర్నా చేపట్టారు. విద్యార్థినులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థినుల ప్రొఫైల్‌ పిక్చర్స్‌ మార్ఫింగ్‌ చేసి చాలామంది విద్యార్థులకు పంపి బ్లాక్‌ మెయిల్‌కి పాల్పడుతున్నారు. దీంతో పిల్లలు ఫోన్‌ ఎత్తాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎవ్వరికీ చెప్పుకోలేక…తమలో తాము వేదన పడ్డారు విద్యార్థులు. దీంతో అప్రమత్తమైన విద్యార్థులు పోలీస్ కాల్ సెంటర్ డయల్‌ 100కు చేసి, పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈఘటనపై కేసునమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు సైబర్ క్రైమ్ పోలీసులు. మరోవైపు గత పదిరోజులుగా ఈ తతంగం జరుగుతున్నా పట్టించుకున్న నాథుడులేడు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ ఓ విద్యార్థిని విడుదల చేసిన ఆడియో క్లిప్పింగ్‌ ఇప్పుడు సర్వత్రా కలకలం రేపుతోంది. తమ పిల్లలకు రక్షణ కల్పించాలని, నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 16, 2023 09:19 AM