Shocking Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. ఎఫ్1 రేస్ చరిత్రలోనే ఈ రేంజ్ యాక్సిడెంట్..! షాకింగ్ వీడియో..
బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్‌లో ఓ భయంకరమైన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద వీడియోని చూస్తే, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. కొందరు ఈ ప్రమాదాన్ని
బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్‌లో ఓ భయంకరమైన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద వీడియోని చూస్తే, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. కొందరు ఈ ప్రమాదాన్ని ఫార్ములా వన్ రేస్ చరిత్రలోనే అతిపెద్ద క్రాష్‌గా అభివర్ణిస్తున్నారు. బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్ 2022లో రేసులో ప్రమాదం జరిగిన కారులో చైనీస్ డ్రైవర్ జౌ గ్వాన్యు ప్రయాణిస్తున్నాడు. జౌ గ్వాన్యు కారును వెనుక ఉన్న మరో కారు ఢీకొట్టింది. దీంతో చైనీస్ డ్రైవర్ కారు అదుపు తప్పింది. కారు బోల్తా పడి, కారు పైభాగం రోడ్డుకు తగలగానే నిప్పురవ్వలు చెలరేగడంతో పాటు మంటలు అంటుకున్నాయి. జౌ గ్వాన్యు కారు రేస్ ట్రాక్‌పై నుంచి జారిపడి ఫెన్సింగ్‌పై పడినట్లు వీడియోలో కనిపిస్తోంది.జౌ గ్వాన్యు కారు మలుపు వద్దకు చేరుకోబోతుండగా, కారు అదుపు తప్పి వెనుక నుంచి వారి కారును మరో కారు ఢీకొట్టింది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రమాదాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఫార్ములా 1 గవర్నింగ్ బాడీ, FIA, ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్‌లిద్దరూ స్పృహలో ఉన్నారని, వైద్య పరీక్షలు చేయించామని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Friendship video: నలుగురు ఫ్రెండ్స్.. ఒకటే గొడుగు.. స్కూల్ ఏమో దూరం..! ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే..
Pocket Money 40 lakhs: ఆమె ఒక్కరోజు పాకెట్ మనీ రూ. 40లక్షలు.. చుస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
Mosquitoes: దోమలు కొందరినే కుట్టడానికి కారణం.. ? శరీర వాసనలలో మార్పులా..?