Boy Emotional video: ‘అమ్మా నీకేం కాదు.. నేను ఇక్కడే ఉన్నా’.. కన్నీరు పెట్టించిన బాలుడి ఆవేదన.. వీడియో.

Updated on: Dec 02, 2022 | 9:43 PM

భుజాలపై మోసి పెంచిన నాన్న ముందు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. విశాలమంత ప్రేమ పంచిన అమ్మ వెనక కూర్చుంది. మధ్యలో 12 ఏళ్ల బాలుడు ఉన్నాడు. అలా అందరూ కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు.


భుజాలపై మోసి పెంచిన నాన్న ముందు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. విశాలమంత ప్రేమ పంచిన అమ్మ వెనక కూర్చుంది. మధ్యలో 12 ఏళ్ల బాలుడు ఉన్నాడు. అలా అందరూ కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. అమ్మానాన్నలే ఆ బాలుడి సర్వస్వం. మొక్కవోని ధైర్యం. కానీ ఇంతలో ఊహించని ఉపద్రవం. వెనక నుంచి వచ్చిన లారీ బలంగా వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బాలుడు లేచి చూసే సరికి.. అమ్మ ముఖంపై నుంచి రక్తం దారలుగా కారుతుంది. నాన్న అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ 12 ఏళ్ల బాలుడికి కూడా చిన్నపాటి గాయాలయ్యాయి. అప్పుడు అతడు పడిన ఆవేదన అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. “అమ్మా నీకేం కాదు.. నేను ఇక్కడ ఉన్నాగా.. అంటూ ఆ పసిహృదయం అమ్మకు ధైర్యం చెబుతోంది. మరోవైపు అంకుల్ కాస్త వాటర్ ఉంటే ఇస్తారా.. ఏం అనుకోకండి ప్లీజ్ కాస్త.. అమ్మ జుట్టు పైకి అని ముఖంపై బ్లడ్ కాస్త కడగరా”.. అంటూ ఆ బాలుడు తల్లిదండ్రుల కోసం ఆరాటపడిన తీరు కన్నీరు పెట్టించింది.అమ్మానాన్నలను నెత్తుటి మడుగులో చూసి ఓ వైపు ఆ బాలుడి హృదయం విలవిల్లాడిపోతుంది. అమ్మ వద్దకు వెళ్లి ధైర్యం చెప్పడం.. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్న ఛాతిపై ఉన్న రక్తం తుడుస్తూ.. వారికి ధైర్యం చెబుతూ.. గుండెనిబ్బరం ప్రదర్శించాడు. ఆపై వెంటనే బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. మణుగూరు మండలం విజయనగరం గ్రామం సమీపంలో నవంబరు 27 రాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది. ఘటనలో శివలింగాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ, భార్య, తనయుడితో కలిసి స్కూటీపై కొండాయిగూడెం నుంచి మణుగూరు ట్రావెల్ చేస్తున్నారు. ఈ క్రమంలో లారీ, స్కూటీని క్రాస్ చేయబోయి బలంగా ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో సత్యనారాయణతో పాటు, భార్య లక్ష్మికి తీవ్రంగా గాయపడ్డారు. వారి తనయుడు నవదీప్‌కి కూడా గాయాలయ్యాయి. వీరిని మణుగూరులోని ఓ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. ఆపై భద్రాచలం తరలించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్‌ గోల్డ్‌ అంటున్న నెటిజనం..

Massage for Minister: తీహార్‌ జైలు కొత్త ట్విస్ట్‌.. మంత్రి సత్యేంద్రకు మసాజ్‌ చేసింది అతడే వ్యక్తి..! వీడియో

Published on: Dec 02, 2022 09:43 PM
Loading...
Unable to load recommendations.
Follow Us