తాంత్రిక పూజల పేరుతో 20 మందిని హత్య చేసిన కిల్లర్ !!
నాగర్‌కర్నూల్ జిల్లాలో సీరియల్ కిల్లర్ ఇష్యూ కలకలం రేపుతోంది. తాంత్రిక పూజల పేరుతో అమాయకులకు ఎర వేసి నలుగురి మరణానికి కారణమైన వ్యక్తిని లేటెస్ట్‌గా గుర్తించారు పోలీసులు. రెండేళ్ల క్రితం గుప్త నిధుల కోసం ఒకే కుటుంబానికి నలుగురిని చంపినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో ఓ హత్య కేసును విచారిస్తున్న సమయంలో సీరియల్ కిల్లర్ సత్యం యాదవ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని హైదరాబాద్‌లో ఈ మధ్య ఒక వ్యక్తిని చంపినట్లు సమాచారం.
నాగర్‌కర్నూల్ జిల్లాలో సీరియల్ కిల్లర్ ఇష్యూ కలకలం రేపుతోంది. తాంత్రిక పూజల పేరుతో అమాయకులకు ఎర వేసి నలుగురి మరణానికి కారణమైన వ్యక్తిని లేటెస్ట్‌గా గుర్తించారు పోలీసులు. రెండేళ్ల క్రితం గుప్త నిధుల కోసం ఒకే కుటుంబానికి నలుగురిని చంపినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో ఓ హత్య కేసును విచారిస్తున్న సమయంలో సీరియల్ కిల్లర్ సత్యం యాదవ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని హైదరాబాద్‌లో ఈ మధ్య ఒక వ్యక్తిని చంపినట్లు సమాచారం. ఈ కేసు విచారిస్తుండగా పోలీసులకు కిల్లర్ సత్యం అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇతనిపై హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూలుజిల్లా, ఏపీలోనూ పలు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదైనట్లు సమాచారం. నాగర్‌కర్నూలుకు చెందిన సత్యం యాదవ్‌పై గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నాయి. తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపణలు చేశారు. గుప్తనిధులు ఉన్నాయని అమాయకులను నమ్మించి, వారి దగ్గర ఉన్న సొమ్ము తీసుకోని పరారైన సందర్భాలు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. గతంలో అతనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు. దాదాపు 20 మందిని హత్యచేసినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

