నువ్వు మామూలోడివి కాదు సామీ.. ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
బంగ్లాదేశ్‌కు చెందిన 35 ఏళ్ల మోరు మియాకు 21 మంది భార్యలు ఉన్నారంటూ స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. భిక్షాటన చేస్తూ జీవించే ఆయన, మహిళలే తనను పెళ్లి చేసుకున్నారని చెప్పినట్లు సమాచారం. వారిలో చాలామంది తనకంటే వయసులో పెద్దవారని, వారి ప్రేమను తిరస్కరించలేక వివాహం చేసుకున్నానని తెలిపినట్లు కథనాలు పేర్కొన్నాయి. భార్యల పేర్లన్నీ గుర్తులేకపోవడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ప్రస్తుత కాలంలో చాలా ప్రాంతాల్లో పెళ్లి చేసుకోడానికి పిల్ల దొరక్క.. నా పెళ్లెప్పుడవుతుంది బాబోయ్..పిల్ల ఏడ దొరుకుంది బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు చాలామంది. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా మందిని పెళ్లిచేసుకుని అందరినీ విస్మయానికి గురిచేశాడు. ఈ విషయం తెలిసి, నెటిజన్లు..సాధారణంగా ఒక్కరిని పోషించడమే కష్టమైన ఈ రోజుల్లో 21 మంది భార్యలా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్‌కు చెందిన 35 ఏళ్ల మోరు మియా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆయనకు ఏకంగా 21 మంది భార్యలు ఉన్నారనే విషయం స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై అతను ఏమన్నాడో తెలుసా.. తాను ఎప్పుడూ కావాలని పెళ్లి చేసుకోలేదని, ఆ మహిళలే తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకున్నారని తెలిపాడు. వారిలో చాలామంది తనకంటే వయసులో పెద్దవారని, వారి ప్రేమను నిరాకరించడం అగౌరవంగా భావించి తాను పెళ్లి చేసుకున్నానని వివరించారు. అసలు తనలో ఏం నచ్చి మహిళలు పెళ్లి చేసుకుంటున్నారో తనకే అర్థం కాదని, ఆ విషయం వారినే అడగాలని ఆయన సరదాగా చెప్పారు. మోరు మియా ఒక చిన్న గదిలో నివసిస్తూ, రోజూ వంతులవారీగా ఒక్కో భార్యను తనతో పాటు భిక్షాటనకు తీసుకెళ్తుంటాడు. అయితే, భార్యల సంఖ్య 21 మంది ఉండటంతో.. అందరి పేర్లు ఆయనకు సరిగ్గా గుర్తులేవు. మీడియా వాళ్లు పేర్లు అడగగా.. షీలా, నర్గీస్, సెలెనా, ఆలియా, తారా, జ్యోత్స్న, రబియా, పరుల్ వంటి కొన్ని పేర్లను మాత్రమే ఆయన గుర్తుచేసుకోగలిగారు. ఒక బిచ్చగాడికి ఇంత మంది భార్యలు ఉండటం, అందునా భార్యల పేర్లే గుర్తులేకపోవడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్, విత్‌డ్రా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..
ఉపాధ్యాయుడి వింత చేష్టలు.. విద్యార్ధి తలపై ఏం చేశాడో చూడండి!
హైదరాబాద్ నుంచి 3 బుల్లెట్ ట్రైన్లు! మూడు నగరాలకు హైస్పీడ్ జర్నీ!
