ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే వీడియో

Updated on: Dec 25, 2025 | 3:48 PM

ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం వరుసగా కీలకమైన సదుపాయాలను ప్రవేశపెడుతుంది. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సేవలను మరింత సులభతరం చేసింది. ఈ సంక్రాంతి తర్వాత ప్రభుత్వం అన్ని రకాల పౌర సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పోలీస్ సేవలను వాట్సప్ గవర్నెన్స్ లోకి తెచ్చింది. ఎఫ్ఐఆర్ నుంచి ట్రాఫిక్ చలాన్ వరకు అన్ని వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. ఏపీ సర్కార్ నూతనంగా తీసుకొచ్చిన వాట్సప్ గవర్నెన్స్‌లో కొత్తగా పోలీస్ శాఖ నుంచి అందుతున్న సేవలను చేర్చారు.

ఇప్పటినుంచి ఏపీ ప్రజలు ఎఫ్ఐఆర్ స్టేటస్ , ట్రాఫిక్ చలాన్లు వివరాలు, మరికొన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సప్ ద్వారా పొందవచ్చు. ఇక చలాన్లను ఆన్లైన్ ద్వారా చెల్లించే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులో పోలీస్ చలాన్లతో పాటు రవాణా శాఖ చలాన్లను కూడా ఉంటాయి. ఈ సేవలను ప్రజలు సులభంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు సేవల వినియోగంపైన అధికారులు సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వ సర్టిఫికెట్లతో పాటు ఆర్టీసీ , దేవాలయ దర్శన్ టికెట్లు కూడా వాట్సప్ గవర్నమెంట్ ద్వారా అందిస్తోంది. తాజాగా ఈ సేవలను విస్తరిస్తూ మరిన్ని కొత్త సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవల వినియోగంపై అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన 95523 00009 నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం నెంబర్‌ను ఫోన్లో సేవ్ చేసుకొని.. మనమిత్ర , వాట్సాప్ గవర్నెన్స్ అనే ఆప్షన్లు ఎంచుకోవాలి. అక్కడ పోలీస్ శాఖ సేవలను కూడా సెలెక్ట్ చేసి కావాల్సిన సేవలను పొందవచ్చు.. చలాన్లను చెల్లించడానికి , వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి , బ్యాంకు ద్వారా చెల్లించి రసీదును పొందవచ్చు.

మరిన్ని వీడియోల కోసం :

స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో

భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో