అనంతపురంలో అద్భుతం.. మండువేసవిలో ఉప్పొంగిన జలధార..

Updated on: Apr 20, 2026 | 6:48 PM

కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. అమడగూరు మండలం కొర్రెవులో రైతు మాలింగప్ప 470 అడుగులకే భారీ జలధారను కనుగొన్నారు. సాధారణంగా వేల అడుగులకు కూడా నీరు దొరకని ఈ ప్రాంతంలో, 15 అడుగుల ఎత్తున జలధార ఎగసిపడటం స్థానికుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. బీడు భూములకు సాగునీరు అందుతుందనే ఆనందం వ్యక్తమవుతోంది.

బీటలువారిన బీడు భూములు, అడుగంటిన భూగర్భ జలాలు.. ఎటు చూసినా కరువు ఛాయలే కనిపించే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భగభగ మండే మండువేసిలో చుక్క నీటి కోసం వేల అడుగుల లోతుకు వెళ్లినా నిరాశే ఎదురయ్యే ప్రాంతంలో.. భూగర్భం నుంచి జలధార ఉబికి వచ్చి ఆకాశాన్ని తాకింది. అమడగూరు మండలం కొర్రెవు గ్రామానికి చెందిన రైతు మాలింగప్ప తన పొలంలో సాగు నీటి కోసం బోరు వేయించారు. సాధారణంగా ఈ ప్రాంతంలో రెండు వేల అడుగుల లోతుకు వెళ్లినా నీటి జాడ దొరకడం అసాధ్యం. కానీ, అనూహ్యంగా కేవలం 470 అడుగుల లోతులోనే భారీ జలసిరి పడింది. భూగర్భం నుండి నీరు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడుతూ సుమారు 15 అడుగుల ఎత్తున ఎగసిపడిన జలధార ఆకాశాన్ని తాకింది. బోరు బావి నుండి ఉవ్వెత్తున ఎగసిపడుతున్న జలధారను చూసి స్థానికులు పరవశించిపోయారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఈ జలసిరిని చూసేందుకు క్యూ కట్టారు. బీటలు వారిన నేలలో గంగమ్మ ఉప్పొంగడం చూసి రైతు మాలింగప్ప ఆనందానికి అవధులు లేవు. స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి కరువుతో అల్లాడుతున్న తమ ప్రాంతంలో ఇంత తక్కువ లోతులో జలధార పడటం తమ అదృష్టమని, ఇది ఇతర రైతుల్లోనూ కొత్త ఆశలను చిగురింపజేస్తోందని గ్రామస్థులు సంబరపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pillow: ఏళ్ల తరబడి ఒకే దిండు వాడుతున్నారా.. అయితే జాగ్రత్త

బయటకు వెళ్దామని బైక్‌ తీసిన వ్యక్తి.. దెబ్బకు హడల్‌

ప్యాకేజీ కాదు.. ప్రశాంతత ముఖ్యం.. రూ.17 లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన IIT గ్రాడ్యుయేట్

మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల జోక్యం తో

ఆ ఆలయంలో అర్చకులుగా.. తరతరాలుగా ఉన్నది వారే

Follow Us