లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కేందుకు సిద్ధమవుతున్న సిమ్రన్ లీవ్‌ను బాస్ చివరి నిమిషంలో రద్దు చేయడంతో, ఆమె "ఐ డోంట్ కేర్" అని బదులిచ్చిన వీడియో వైరల్ అయ్యింది. ఇది నెట్టింట వర్క్-లైఫ్ బ్యాలెన్స్, కార్యాలయ కమ్యూనికేషన్ లోపాలు, మేనేజర్లు, ఉద్యోగుల బాధ్యతలపై తీవ్ర చర్చకు దారితీసింది.
చివరి క్షణంలో బాస్ లీవ్ క్యాన్సిల్ చేయడంతో ఓ యువతి స్పందించిన తీరు పై నెట్టింట్ తీవ్ర చర్చ మొదలైంది. తన జర్నీ ప్లాన్స్ గురించి ముందుగానే చెప్పినా, సరిగ్గా ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా సెలవు రద్దు చేశాడట మేనేజర్. సిమ్రన్ అనే యువతి షేర్ చేసిన వీడియోలో తను సెలవు మీద వెళ్లాలనుకుంటున్నట్టు కొన్ని వారాల ముందుగానే మేనేజర్‌కు తెలిపింది. ఆ సమయంలో ఎటువంటి అభ్యంతరం చెప్పలేదట. కానీ విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి సిద్ధమవు తున్నప్పుడు, ఆమె సెలవు రద్దు చేసినట్టు బాంబు పేల్చాడు మేనేజర్. దీంతో షాకైన ఆమె “ఐ డోంట్ కేర్” అని సమాధాన మిచ్చిందట. ఉద్యోగులు చివరి నిమిషంలో డిమాండ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే సిద్ధాంతాన్ని తాను నమ్మనని తెలిపింది. వీడియో వైరల్ కావడంతో నెట్టింట వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై చర్చ జరిగింది. ఇది కమ్యూనికేషన్ వైఫల్యం అని కొందరు అన్నారు. ఉద్యోగుల వ్యక్తిగత సమయం పట్ల గౌరవం లేకపోవడానికి నిదర్శమని కొందరు వ్యాఖ్యానించారు. మేనేజర్ సరైన బ్యాకప్‌ను ఏర్పాటు చేసుకొని, లీవ్ సంగతి స్పష్టంగా తెలియచేయాలని మరికొందరు అన్నారు. మరికొందరు సెలవును అధికారికంగా ఆమెదించారా? లేదా అన్న విషయాన్ని ప్రయాణాలప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచించారు. ఈ బాధ్యత ఉద్యోగిపై ఉందని ఒకరన్నారు. మొత్తం మీద ఈ వీడియో ఆఫీసులో అధికారుల ప్రవర్తనా తీరు పైనా ఉద్యోగుల జవాబుదారీతనాన్ని హైలైట్ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET: ఫ్యాన్స్ బీ అలర్ట్ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్
9 ఏళ్ల కిందట రూ.500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు కన్నీరు
బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’
