కారు స్టార్ట్‌ చేసి కిందికి దిగి రిపేర్‌ చేయబోయాడు.. అంతే క్షంలో !!

|

Sep 19, 2022 | 8:49 PM

ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి మన పొరపాటు లేకపోయినా ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇక్కడ వైరల్‌ అవుతోంది.

ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి మన పొరపాటు లేకపోయినా ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇక్కడ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు స్టార్ట్‌ చేసి రిపేర్‌ చేస్తుండగా ఊహించని సీన్‌ ఎదురైంది..అయితే అతడు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అసలేం జరిగిందంటే.. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి బయటకు వెళ్దామని ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న కారును స్టార్ట్‌ చేశాడు. అది స్టార్ట్‌ కాకపోవడంతో.. కారు ఆన్‌లోనే ఉంచి, కారు మందుకు వచ్చి బానెట్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత కారులోకి వెళ్లి కారు స్టార్ట్ చేశాడు. తర్వాత ముందుకు వచ్చి..కారు ఇంజన్ పరిశీలించాడు. అయితే అప్పటికే కారు స్టార్ట్ చేసి ఉండడంతో ఒక్కసారిగా కారు ముందుకు కదలింది. అతన్ని ఢీకొట్టుకుంటూ ముందున్న షట్టర్‌లోకి దూసుకుపోయింది. పాపం అతను కారుకి షట్టర్‌కి మధ్య ఇరుక్కుపోయాడు. అతడి అదృష్టం బాగుంది..అక్కడే ఉన్న కొందరు స్థానికులు గమనించిన వెంటనే స్పందించారు. అతడిని కాపాడే ప్రయత్నం చేశారు.. ఈ వీడియోను దీపక్ ప్రభు అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ..ఆటోమేటిక్ వాహనం చెడిపోయినట్లయితే… వాటి ముందు ఎప్పుడూ నిలబడకండి.. అంటూ కాప్షన్‌ జోడించారు. ఇలాంటి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా వేలాదిమంది లైక్‌ చేశారు. తమదైనశైలిలో రకరకాల కామెంట్లు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా.. గుండె బరువెక్కే వీడియో !!

Digital TOP 9 NEWS: కారుకు కుక్కను కట్టి పరిగెత్తించిన డాక్టర్.! | బతికున్న భార్యలకు పిండ ప్రదానం.!

దీనస్థితిలో.. ప్రభుత్వ ఆసుపత్రిలో.. అలనాటి హీరోయిన్ !!

Samantha: ఆ వ్యాధితో బాధపడుతున్న సమంత !! ట్రిట్మెంట్‌ కోసం ఫారెన్‌కు !!

కోట్లు చూసి ప్రేమిస్తే.. చివరికి జైళ్లో చిప్పకూడే పాప !!

 

 

Published on: Sep 19, 2022 08:49 PM