Viral Video: ఇదేం వైద్యంరా బాబు.. పాపం చెవి నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. చేయి తీసేసారు..(వీడియో)
వుడి తర్వాత అంత భక్తితో మొక్కేది ఒక్క డాక్టర్లకు మాత్రమే. వైద్యులను దైవంగా భావిస్తారు ప్రజలు. అలాంటి వైద్యులు ప్రజలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
వుడి తర్వాత అంత భక్తితో మొక్కేది ఒక్క డాక్టర్లకు మాత్రమే. వైద్యులను దైవంగా భావిస్తారు ప్రజలు. అలాంటి వైద్యులు ప్రజలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రోగుల ప్రాణాలకు తృణప్రాయంగా భావిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే బిహార్ రాజధాని పాట్నా లో వెలుగుచూసింది. చెవి నొప్పితో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన యువతి ఆఖరికి తన చెయ్యిన పోగొట్టుకోవలసి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
రాష్ట్రంలోని శివహర్ జిల్లాకు చెందిన రేఖ చెవి విపరీతమైన చెవి నొప్పితో బాధపడుతోంది. దాంతో ఆమె పాట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ హాస్పిటల్‌కు జులై 11న చికిత్స కోసం తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు.. రిపోర్ట్స్ పరిశీలించి అవసరమైన ఆపరేషన్ చేశారు. ఆపై ఓ ఇంజక్షన్ చేశారు. అనంతరం ఇంటికి వెళ్లగా.. రేఖకు ఎడమ చేయి కలర్ మారిపోయింది. విపరీతమైన నొప్పితోపాటు.. వాపుకూడా వచ్చింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా.. ఏం కాదని చెప్పి ఇంటికి పంపేశారు. ఆ తర్వాత నొప్పి ఎక్కువడం, మెడిసిన్ వాడినా చేయి నొప్పి తగ్గకపోవడంతో.. ఇటీవల పాట్నాలోని మేదాంత హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చేయిని పరిశీలించి, చేతికి ఇన్‌ఫెక్షన్ సోకిందని.. వెంటనే తొలగించాలని. అలా రేఖ ఎడమచేయి.. మోచేతి వరకు తొలగించారు. ఇదిలా ఉంటే.. రేఖకు ఈ ఏడాది నవంబర్‌లో వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. తాజాగా ఆమె చేయిని తొలగించడంతో.. వరుడు పెళ్లికి నిరాకరించడం బాధాకరం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos