Gang rape: యువకుడిపై నలుగురు యువతుల గ్యాంగ్ రేప్.. మత్తుమందు చల్లి తాళ్లతో కట్టేసి దారుణం.. వీడియో.

|

Nov 30, 2022 | 5:27 PM

ఇప్పటి వ‌ర‌కు యువ‌తులు, మ‌హిళ‌ల‌ు, చిన్నారులపై అత్యాచారాలు జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుతం ఓ వెరైటీ కేసు వెలుగులోకి వచ్చింది.


జలంధర నగరంలోని కపుర్తలా రోడ్డులో ఓ యువకుడు పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడికి ఓ కారులో వచ్చిన అమ్మాయిలు.. ఆ యువకుడిపై మత్తుమందు చల్లారు. అతడిని కిడ్నాప్​ చేశారు. ఆ తర్వాత ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లారు. పూటుగా మద్యం తాగిన ఆ యువతులు ఆ యువకుడిని కూడా మద్యం తాగాలని బలవంతం చేశారు. అనంతరం అతడిని తాళ్లతో కట్టి, అత్యాచారం చేశారు. తెల్లవారు జామున 3 గంటలకు అదే కారులో యువకుడిని ఎక్కించుకుని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఉదయం స్పృహ వచ్చాక ఆ యువకుడు తనపై అత్యాచారం జరిగిందని గుర్తించాడు. వెంటనే ఓ వీడియో విడుదల చేశాడు. తనపై అత్యాచారం జరిగిందని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన పరువు పోతుందని, అందుకే కంప్లైంట్ ఇవ్వలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియో వైరల్ గా మారడంతో జలంధర్​ డీసీపీ జగన్మోహన్ ​సింగ్ ​స్పందించారు. తమ వద్దకు ఇలాంటి కేసు ఏదీ రాలేదని, ఏ పోలీస్​స్టేషన్​‌లోనూ ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్‌ గోల్డ్‌ అంటున్న నెటిజనం..

Massage for Minister: తీహార్‌ జైలు కొత్త ట్విస్ట్‌.. మంత్రి సత్యేంద్రకు మసాజ్‌ చేసింది అతడే వ్యక్తి..! వీడియో

Follow us on