Women Tattoo: అమ్మా వద్దూ.. అని చెప్పినా ఆ తల్లి వినలేదు.. చివరికి..! కనులు గుడ్లు వాచిపోయి పూర్తిగా..

|

Dec 14, 2022 | 9:07 AM

ఓ మోడల్‌ను చూసి తానూ అలా కనిపించాలనుకుంది ఓ మహిళ. ఆమె కూతురు వద్దని చెప్పినా వినలేదు. చివరికి కంటిచూపునే కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంది. ఆస్ట్రేలియన్...


ఓ మోడల్‌ను చూసి తానూ అలా కనిపించాలనుకుంది ఓ మహిళ. ఆమె కూతురు వద్దని చెప్పినా వినలేదు. చివరికి కంటిచూపునే కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంది. ఆస్ట్రేలియన్ మోడల్ అంబర్ లక్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాలని తన కళ్లకు నీలి రంగు టాటూ వేయించుకుంది. అయితే, ఆ లుక్‌ చూసి ఇన్‌స్పైర్ అయిన నార్త్ ఐర్లాండ్‌కు చెందిన అనయా పీటర్సన్ అనే మహిళ ఏకంగా తన కనుగుడ్లపై బ్లూ, పర్పుల్ రంగులతో పచ్చబొట్టు వేయించుకుంది. అది చాలా ప్రమాదం వద్దని ఆమె ఏడేళ్ల కూతురు ఎంత చెప్పినా ఆమె వినలేదు. కనుగుడ్లపై టాటూ వేయించుకుంది. మొదట్లో బాగానే ఉన్నా.. ఆ తరువాత రియాక్షన్ మొదలయింది. కనుగుడ్లు వాచిపోయి కళ్లు పూర్తిగా మూసుకుపోయాయి. దాంతో ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఆమె కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు.కాగా, అనయా టాటూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. చిన్న పాప చెప్పినా వినకుండా పిచ్చి పనులు చేసి.. ఇప్పుడు ఇబ్బందులు పడటం అవసరమా? అంటూ కాస్త గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే మరి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 14, 2022 09:07 AM