Visakhapatnam: విశాఖ తీరంలో 12 గంటలు పాటు నరకయాతన పడ్డ ఓ యువతి.. ఏం జరిగిందంటే..?
వారం రోజుల క్రితం చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది ఓ యువతి. తన వెంటే ఉంటాడనుకున్న యువకుడు.. ఆపద సమయంలో వదిలి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ రాత్రంతా 12 గంటలపాటు మృత్యువుతో పోరాడింది. అయినా ఆ యువకుడిని ఏమీ అనొద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖనగర శివారు అప్పికొండ సాగర తీరంలో ఈ విచిత్ర సంఘటన జరిగింది.
వారం రోజుల క్రితం చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది ఓ యువతి. తన వెంటే ఉంటాడనుకున్న యువకుడు.. ఆపద సమయంలో వదిలి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ రాత్రంతా 12 గంటలపాటు మృత్యువుతో పోరాడింది. అయినా ఆ యువకుడిని ఏమీ అనొద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖనగర శివారు అప్పికొండ సాగర తీరంలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. దువ్వాడ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ యువతి ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది. ఓ యువకుడితో కలిసి విశాఖపట్నంలోని అప్పికొండ శివాలయ పరిసరాల్లో ఉంటోంది. అక్టోబరు 8 సాయంత్రం ఈ ఇద్దరూ సరదాగా సాగర తీరానికి వెళ్లారు. అక్కడ రాళ్ల గుట్టలపై ఆమె సెల్ఫీ తీసుకుంటుండగా.. ఒక్కసారిగా ఎత్తు ప్రదేశం నుంచి జారి పడిపోయింది. తీవ్రగాయాలతో రాళ్ల గుట్టల మధ్య చిక్కుకుపోయిన యువతిని రక్షించాల్సింది పోయి భయంతో పారిపోయాడు ఆ యువకుడు. చిమ్మ చీకటి, జన సంచారం లేని ప్రదేశంలో రాత్రంతా మృత్యువుతో పోరాడింది. మర్నాడు ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు వ్యక్తులు యువతిని చూసి అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల సహాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. ఏ జరిగింది, ఎక్కడినుంచి వచ్చావని యువతిని ఆరాతీసారు అంబులెన్స్ సిబ్బంది.. రాళ్లపై నిల్చుని సెల్ఫీ దిగుతూ కాలుజారి పడిపోయానని, పరారీలో ఉన్న యువకుడిని ఏం అనవద్దని తెలిపింది. వివరాలు తెలుసుకొని అంబులెన్సు సిబ్బంది యువతి తల్లికి సమాచారమిచ్చారు. కుమార్తె కనపడటంలేదని కొన్ని రోజుల క్రితమే బందరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు యువతి తల్లి తెలిపింది. కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు బందరు పీఎస్ నుంచి అంబులెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరారీలో ఉన్న యువకుడికి ప్రమాదం జరిగిందని, అతను కూడా కేజీహెచ్‌లో ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..