Watch: వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా.! నడిచి వెళ్లిన నో సేఫ్టీ..
ఆవగింజంత ఆయుష్షు ఉంటే చావు అంచుల వరకూ వెళ్లి కూడా ప్రాణాలతో బయటపడొచ్చన్నది నానుడి. అదే ఓ మహిళ విషయంలో నిజమైంది. ఓ వీధిలో నడిచి వెళ్తున్న మహిళపై ఊహించని విధంగా పైనుంచి ఓ పెద్ద వాటర్ ట్యాంకర్ పడుతుంది. ఆ దృశ్యాన్ని చూసి ఆ మహిళ తీవ్రంగా గాయపడి ఉంటుందని భావించారు అంతా. ఆ తర్వాత అదృష్టం అంటే ఆమెదే అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.
అదొక చిన్న వీధి. ఆ వీధిలో ఉన్న ఓ ఇంటిలోంచి మహిళ బయటకువచ్చి.. ఎదురింటికి వెళ్తోంది. ఈ క్రమంలో పైనుంచి ఓ పెద్ద ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ ఆ మహిళపైన పడింది. ఆ శబ్ధానికి ఎదురింటిలోని వ్యక్తి పరుగున బయటకు వచ్చి చూసాడు. మరోవైపునుంచి మరో వ్యక్తి కూడా పరుగెత్తుకొచ్చాడు. ట్యాంక్ కింద పడిన మహిళ పరిస్థితి ఏమై ఉంటుందా అని అంతా ఆందోళన చెందారు. అయితే ఆ వాటర్ ట్యాంక్ పూర్తిగా పాతబడిపోయింది. దాని అడుగుభాగం తొలగించి ఉంది. అది సరిగ్గా అడుగు భాగం ఆమె తలపైనుంచి పడటంతో ఆమె అందులో చిక్కుకున్నారు. దాంతో ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అయితే ఆ టాంకు ఆమెపై పడినా ఆమె భయపడకుండా లేచి నిలబడింది. అంతేకాదు ఆమె ఏదో తింటోంది. చుట్టూ అందరూ కంగారు పడుతున్నా ఆమె తినడం మాత్రం ఆపలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.