Priest: మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి.. ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే..

|

Jun 27, 2022 | 9:02 PM

ఇదో మిస్టరీ కేసు… మహిళ స్పర్శ తగిలితే చాలు.. మూర్ఛపోతున్నాడు ఈ పూజారి. అందుకే ఆలయానికి వచ్చిన మహిళలను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. దూరం నుంచే హారతి ఇస్తున్నాడు. మహిళలు కాస్త దగ్గరగా వస్తే చాలు తెగ భయపడిపోతున్నాడు.


ఇదో మిస్టరీ కేసు… మహిళ స్పర్శ తగిలితే చాలు.. మూర్ఛపోతున్నాడు ఈ పూజారి. అందుకే ఆలయానికి వచ్చిన మహిళలను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. దూరం నుంచే హారతి ఇస్తున్నాడు. మహిళలు కాస్త దగ్గరగా వస్తే చాలు తెగ భయపడిపోతున్నాడు. మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ఈ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఇలా మహిళలు.. టచ్ చేయగానే కళ్లు తిరిగి పడిపోవడానికి కారణం కూడా ఆ పూజారే చెప్పేస్తున్నాడు. తాను ఆంజనేయుడిని వీపరీతంగా ఆరాధిస్తానని.. అందుకే ఇలా జరుగుతుందని చెప్పుకొచ్చాడు. అసలు ఈ పూజారి సమస్య ఏంటో తేల్చాలని..స్థానికంగా ఉన్న సైకియాట్రిస్ట్​ దగ్గరకు తీసుకెళ్లారు కొందరు భక్తులు. జేపీ ఆసుపత్రి సైకియాట్రిస్ట్​​ డా.ఆర్​.కె.బైరాగి అతడిని పరీక్షించారు. వివిధ రకాల టెస్టులు చేశారు. అయితే రిపోర్ట్స్ అన్నింటిలోనూ నార్మల్ అనే వచ్చింది. దీంతో డాక్టర్ కూడా కాస్త దీర్ఘంగా ఆలోచించారు. అనంతరం ఆ పూజారికి ఓ టెస్ట్ పెట్టారు. ‘లేడీ నర్సు నిన్ను తాకుతుంది. నువ్వు స్పృహా కోల్పోతావో లేదో మేము చూస్తాం’ అని పూజారితో చెప్పారు డాక్టర్. కానీ మహిళా నర్సుతో కాకుండా, అక్కడే పని చేస్తున్న ఓ వ్యక్తితో తాకమని చెప్పాడు డాక్టర్​. అది తెలియని ఆ పూజారి మాత్రం స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి తేరుకున్నాక డాక్టర్​ జరిగినదంతా చెప్పాడు. ఆపై అతను మానసిక రుగ్నతతో బాధపడుతున్నట్లు గుర్తించిన డాక్టర్.. ఆ మేరకు చికిత్స ప్రారంభించారు.ఇలాంటి స్థితి ఉన్నవారిని సైకోపత్ ​అని​ అనొచ్చని, వీరికి వైద్యంతో పాటు కౌన్సిలింగ్​ అందిస్తే సరిపోతుందని డాక్టర్​ బైరాగి చెప్పారు. ‘కొందరు తమను తాము సూపర్ హీరోలుగా.. దేవుళ్లుగా భావిస్తున్నారు. ఇంకొందరు తమకు అతీత శక్తులున్నట్లు ఫీల్ అవుతుంటారు. ఫలానా విషయం గురించి అతిగా ఆలోచించడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ పూజారి కూడా తనలో భగవంతుడి శక్తి ఉందని భావిస్తున్నాడు. అందుకే ఇలా చేస్తున్నాడు’ అని డా.ఆర్​.కె. బైరాగి తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Follow us on