Jackpot: కొడితే జాక్ పాట్ అలా కొట్టాలి.! లాటరీలో రూ.45 కోట్లు గెలుచుకున్న శ్రీజు
చాలామంది ఎంతోకష్టపడి జీవనం సాగిస్తుంటారు. కష్టపడుతూనే ఉంటారు.. అలాంటి వారి కష్టాన్ని చూసి అప్పుడప్పుడూ అదృష్టానికి కూడా జాలేస్తుందేమో.. అందుకే అప్పుడప్పుడు అలాంటి వారిని పలకరిస్తుంటుంది. అయితే అది ఎప్పుడు...? ఎలా...? అనేది మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే కేరళకు చెందిన ఓ వ్యక్తి లైఫ్‌లో జరిగింది. 11 ఏళ్లుగా యునైడెట్ అరబ్ ఎమిరేట్స్‌లో కష్టపడి పనిచేసుకుంటూ కుటుంబాన్ని...
చాలామంది ఎంతోకష్టపడి జీవనం సాగిస్తుంటారు. కష్టపడుతూనే ఉంటారు.. అలాంటి వారి కష్టాన్ని చూసి అప్పుడప్పుడూ అదృష్టానికి కూడా జాలేస్తుందేమో.. అందుకే అప్పుడప్పుడు అలాంటి వారిని పలకరిస్తుంటుంది. అయితే అది ఎప్పుడు…? ఎలా.? అనేది మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే కేరళకు చెందిన ఓ వ్యక్తి లైఫ్‌లో జరిగింది. 11 ఏళ్లుగా యునైడెట్ అరబ్ ఎమిరేట్స్‌లో కష్టపడి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓవ్యక్తిని అదృష్టం లాటరీ రూపంలో పలకరించింది. ఏకంగా అతనికి 45 కోట్ల రూపాయలు గిఫ్ట్‌గా ఇచ్చింది. చాలా మంది భారతీయుల్లానే కేరళకు చెందిన శ్రీజు అనే వ్యక్తి కూడా యూఏఈకి వలస వెళ్లాడు. అందరిలానే తాను కూడా అక్కడ లాటరీలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. లాటరీ టిక్కెట్లను కొంటూ వచ్చాడు. సరిగ్గా ఒక రోజు ఊహించని విధంగా ఆయన కొన్న లాటరీ టిక్కెట్ అతని జీవితాన్నే మార్చేసింది. యూఏఈలో ఉంటున్న శ్రీజుకి ఏకంగా భారతీయ కరెన్సీలో 45 కోట్ల విలువైన లాటరీ తగిలింది. దాంతో శ్రీజు నందానికి అవధుల్లేకుండా పోయాయి. 11 ఏళ్లుగా యూఈఏలో ఆయిల్ గ్యాస్ కంపెనీలో కంట్రోల్ రూం ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని, మంచి ఇల్లు కొనుక్కుని , కేరళకు తిరిగి వెళ్లిపోవాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఇక లాటరీ రూపంలో తన దశ తిరిగినట్టేనని, ఇంత పెద్దమొత్తం వస్తుందని ఊహించలేదంటూ ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

