Viral Video: తేనె కోసం వెళితే బంగారు నాణేల బిందె దొరికింది.. కట్ చేస్తే రంగంలోకి పోలీసులు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టెపల్లికి చెందిన వరుణ్, అజిత్, వెంకటేశ్వర్లు అనే నలుగురు యువకులు తేనె కోసం గ్రామ సమీపంలోని కొండ పై ఉన్న పురాతన అంకమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ వారికి ఎంతో విలువైన బంగారు నాణేలుతో కూడిన చెంబు దొరికింది. అక్కడ రాళ్ల కింద వారికి ఇత్తడి చెంబు కనిపించింది. అయితే రాళ్లను తొలగించి చెంబు ను బయటకు తీసిన యువకులు దాన్ని పగులకొట్టి చూడగా అందులో బంగారు నాణేలు కనిపించాయి.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టెపల్లికి చెందిన వరుణ్, అజిత్, వెంకటేశ్వర్లు అనే నలుగురు యువకులు తేనె కోసం గ్రామ సమీపంలోని కొండ పై ఉన్న పురాతన అంకమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ వారికి ఎంతో విలువైన బంగారు నాణేలుతో కూడిన చెంబు దొరికింది. అక్కడ రాళ్ల కింద వారికి ఇత్తడి చెంబు కనిపించింది. అయితే రాళ్లను తొలగించి చెంబు ను బయటకు తీసిన యువకులు దాన్ని పగులకొట్టి చూడగా అందులో బంగారు నాణేలు కనిపించాయి. దాంతో యువకులు ఆ చెంబును గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్దకు వెళ్లి విషయం చెప్పి, చెంబును పూర్తిగా పగులకొట్టి చూడాలని అతనికి ఇచ్చారు. దాంతో చెంబు ను లోపలికి తీసుకువెళ్లిన వ్యక్తి కాసేపటికి బయటకి వచ్చి చెంబులో ఏమి లేవని, చెంబు బయట పడేయాలని చెప్పాడు. అయితే అప్పటికే చెంబులో దొరికిన నాణేలను ఫోటో తీసిన యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీ ని కలిశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా వంద గ్రాముల నాణేలను రికవరీ చేసినట్లు తెలిసింది. చెంబులో దొరికిన నాణేలు మూడు కేజీలకు పైగా వుంటాయని కోట్ల రూపాయలు విలువ చేస్తాయని స్థానికులు అంటున్నారు. జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే కోట్ల రూపాయల విలువైన నాణేలు బయటకు వస్తాయని అంటున్నారు స్థానికులు. అయితే దొరికిన బంగారు నాణేలు ఏ శతాబ్ధానికి చెందినవో తెలియదు. కానీ, వాటిపై తాజ్ మహల్, ఇంకా ఉర్దూ పదాలు ఉన్నాయని చెప్పారు. యువకులకు బంగారు నాణేలు దొరికాయి. కానీ, వాటాల్లో తేడారావడం తో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

