Crime: ఎయిర్‌పోర్ట్‌లో తేడాగా కనిపించిన వ్యక్తి.. తడబడుతూ నడిచాడు.. దొరికిపోయాడు.

Updated on: Apr 29, 2023 | 9:40 PM

ఎప్పటిలానే ఆ రోజు కూడా కస్టమ్స్ అధికారులు, పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ అప్పుడే ల్యాండ్ అయింది. ప్రయాణీకులు ఒక్కొక్కరిగా ఎగ్జిట్ నుంచి లోపలికి వస్తున్నారు.

ఎప్పటిలానే ఆ రోజు కూడా కస్టమ్స్ అధికారులు, పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ అప్పుడే ల్యాండ్ అయింది. ప్రయాణీకులు ఒక్కొక్కరిగా ఎగ్జిట్ నుంచి లోపలికి వస్తున్నారు. ఇంతలో అధికారులకు ఓ వ్యక్తి కదలికలపై అనుమానమొచ్చింది. అతడ్ని తనిఖీ చేసిన పోలీసులకు మైండ్‌ బ్లాంక్ అయింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చెన్నై విమానశ్రయంలో దిగిన ఆ వ్యక్తి నడక చూసి అనుమానించిన పోలీసులు అతన్ని పక్కకు తీసుకెళ్లి చెక్‌ చేశారు. చివరికి అతని బట్టలు విప్పించారు. అతని రెండు కాళ్లకు బ్యాండేజ్‌లు ఉన్నాయి. వాటని ఓపెన్‌ చేసి చూడగా 1128 గ్రామలు బంగారం బయటపడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ఆ వ్యక్తి బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు . అతడి దగ్గర నుంచి 70 లక్షలు విలువైన 24 కారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: Apr 29, 2023 09:40 PM