Viral Video: పట్టపగలు.. అందరూ చూస్తుండగానే అతను ఏం చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే.
కృష్ణమూర్తి అనే వ్యక్తి తన ఇంటికోసం 15 లీటర్ల సన్‌ఫ్లవర్ వంటనూనె డబ్బా తీసుకొని బైక్‌పైన వెళ్తున్నాడు. మధ్యలో ఓ చోట కూరగాయలు కొనేందుకు ఆగాడు. నూనెడబ్బా బైక్‌కే ఉంచి రోడ్డుపక్కనే ఉన్న కూరగాయల షాపు ముందు బైకు పార్క్ చేసి కూరగాయలు కొంటున్నాడు. అక్కడ వచ్చేపోయే జనాలతో రోడ్డు కూడా జనసందోహంతోనే ఉంది. ఇంతలో ఓ వ్యక్తి మరోబైక్‌పైన వచ్చాడు. నూనె డబ్బా ఉన్న ఈ బైక్ పక్కన ఆపాడు. కాసేపు అటూ ఇటూ చూశాడు.
సాధారణంగా మనం షాపింగ్ లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి బయటకు వెళ్లినప్పుడు వేర్వేరు దుకాణాలకు వెళ్తుంటాము. ఒకచోట కొన్న వస్తువులు మోత ఎందుకని బండిమీదో, కారులోనో వదిలిపెట్టి వెళ్తుంటాము. అలా రోడ్డుమీద బైక్‌కి ఓ ఆయిల్ డబ్బా తగిలించి మరో షాపులోకి వెళ్లాడు ఓ వ్యక్తి. ఇంతలో ఏం జరిగిందో మీరే చూడండి.. కృష్ణమూర్తి అనే వ్యక్తి తన ఇంటికోసం 15 లీటర్ల సన్‌ఫ్లవర్ వంటనూనె డబ్బా తీసుకొని బైక్‌పైన వెళ్తున్నాడు. మధ్యలో ఓ చోట కూరగాయలు కొనేందుకు ఆగాడు. నూనెడబ్బా బైక్‌కే ఉంచి రోడ్డుపక్కనే ఉన్న కూరగాయల షాపు ముందు బైకు పార్క్ చేసి కూరగాయలు కొంటున్నాడు. అక్కడ వచ్చేపోయే జనాలతో రోడ్డు కూడా జనసందోహంతోనే ఉంది. ఇంతలో ఓ వ్యక్తి మరోబైక్‌పైన వచ్చాడు. నూనె డబ్బా ఉన్న ఈ బైక్ పక్కన ఆపాడు. కాసేపు అటూ ఇటూ చూశాడు. మెల్లగా బైక్‌కి తగిలించి ఉన్న ఆయిల్‌డబ్బాను తీయడానికి ప్రయత్నించాడు. అది రాలేదు. కాసేపు తటపటాయించి అటూ ఇటూ చూసి ఎవరికీ అనుమానం రాకుండా ఆయిల్ డబ్బా తీసుకుని తన బైక్‌పైన పెట్టకుని వెళ్లిపోయాడు. ఇంతలో కృష్ణమూర్తి కూరగాయలు తీసుకొని బైక్ స్టార్ట్ చేసుకుంటూ వెనక్కి చూసాడు. ఇంకేముంది నూనెడబ్బా మిస్. నూనె డబ్బా కనిపించకపోయేసరికి షాకయ్యాడు. 15 లీటర్ల నూనె దొంగపాలైపోయిందని లబోదిబోమన్నాడు. చుట్టూ గమనించి అక్కడున్న సీసీ పుటేజీని పరిశీలించగా ఈ దొగ నిర్వాకం బయటపడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీడెవడండీ బాబు.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.