Love story of two girls: అమ్మాయిల ప్రేమకథలో ఊహించని ట్విస్ట్.. మరొకరితో ప్రేమాయణం.. వీడియో వైరల్..

|

Feb 13, 2023 | 10:04 AM

ఆ ఇద్దరూ ప్రాణప్రదంగా ప్రేమించుకున్నారు.. పెద్దల అంగీకారం కోసం పెద్ద సాహసమే చేశారు. అందరి అంగీకారంతో వివాహం చేసుకున్నారు... ఐదేళ్లు తిరిగేసరికి కథ కంచికి.. అమ్మాయి కోర్టుకి వెళ్లింది.


ఝాన్సీ జిల్లాకు చెందిన సనా ఖాన్, సోనాల్ శ్రీవాత్సవ 2017లో వివాహం చేసుకున్నారు. సనాఖాన్ 6 లక్షల రూపాయలు ఖర్చు చేసి లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా పురుషుడిగా మారి తన పేరును సుహైల్ ఖాన్‌గా మార్చుకుంది. ఇన్ని రోజులు ఇద్దరూ కాపురం కూడా చేశారు. ఇప్పుడు సోనాల్ శ్రీవాత్సవ అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించింది. నీతో కలిసి ఉండలేనంటూ సుహైల్‌కు తేల్చి చెప్పింది. దీంతో నిర్ఘాంతపోయిన సుహైల్ కోర్టును ఆశ్రయించింది. వివాహం చేసుకున్న తర్వాత సోనాల్‌కు ఓ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. అక్కడామెకు మరో అబ్బాయితో పరిచయం ఏర్పడటంతో అది కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో సనా ఖాన్‌ను దూరంపెట్టడం ప్రారంభించింది. నీతో కలిసి ఉండటం ఇకపై సాధ్యం కాదని, కావాలంటే నువ్వు మళ్లీ అమ్మాయిగా మారమంటూ చెప్పడంతో సనాఖాన్‌ షాకైంది. సోనాల్‌కు ఎంతగానో నచ్చచెప్పింది. అయినా ఆమె వినిపించుకోకపోవడంతో చేసేదిలేక గత ఏడాది జూన్‌లో సనా కోర్టును ఆశ్రయించింది. కేసు విచారణకు హాజరు కావాలంటూ సోనాల్‌కు కోర్టు నోటీసులు పంపింది. అవి స్వీకరించేందుకు నిరాకరించడంతో కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అరెస్ట్ చేసిన పోలీసులు జనవరి 18న ఆమెను కోర్టులో హాజరుపరిచారు. అదే రోజు కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది. ఫిబ్రవరి 23కు కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Feb 13, 2023 08:37 AM