Viral: గర్భిణీ అనే కనికరం లేకుండా.. కదులుతున్న బస్సు నుంచి భార్యను తోసేశాడు.!
కడదాకా కలిసి బతకాల్సిన భర్త తన భార్యను దారుణంగా కడతేర్చాడు. గర్భిణీ అనే కనికరం కూడా లేకుండా కదులుతున్న బస్సులో నుంచి కిందికి తోసేశాడు. దీంతో తీవ్ర గాయాలతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. తమిళనాడు దిండుక్కల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపింది. వెంబార్‌పట్టికి చెందిన పాండియన్‌కు, కల్‌వెలిపట్టికి చెందిన వళర్మతికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. వళర్మతి ప్రస్తుతం అయిదునెలల గర్భవతి.
కడదాకా కలిసి బతకాల్సిన భర్త తన భార్యను దారుణంగా కడతేర్చాడు. గర్భిణీ అనే కనికరం కూడా లేకుండా కదులుతున్న బస్సులో నుంచి కిందికి తోసేశాడు. దీంతో తీవ్ర గాయాలతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. తమిళనాడు దిండుక్కల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపింది. వెంబార్‌పట్టికి చెందిన పాండియన్‌కు, కల్‌వెలిపట్టికి చెందిన వళర్మతికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. వళర్మతి ప్రస్తుతం అయిదునెలల గర్భవతి. భార్యాభర్తలిద్దరూ కల్‌వెలిపట్టి వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ఆ సమయంలో పాండియన్ మద్యం మత్తులో ఉన్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర కోపోద్రిక్తుడైన పాండియన్ తన భార్యను బస్సులోంచి తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పాండియన్ ను అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos