Lorry Structed: సీఎం వెళ్లే రూటులో ఇరుక్కుపోయిన భారీ లారీ.. చివరకు..!
అది గుంటూరు జిల్లా తాడేపల్లి. ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతం. అక్కడి నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గముంది. ఎప్పుడూ ఆటోలు, బస్సులు, మిని వ్యాన్లు ఆ రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి. హెవీ వెహికల్స్ ఆ రోడ్డులోకి రావు. అక్కడ రైల్వే అండర్ పాస్ ఉంది. అందుకే ఆ మార్గం గుండా హెవీ వెహికల్స్ రావు. అయినా సరే ఓ భారీ లారీ వచ్చింది. అక్కడే పెద్ద చిక్కొచ్చింది. అధికారులకు చెమటలు పట్టించింది.
అది గుంటూరు జిల్లా తాడేపల్లి. ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతం. అక్కడి నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గముంది. ఎప్పుడూ ఆటోలు, బస్సులు, మిని వ్యాన్లు ఆ రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి. హెవీ వెహికల్స్ ఆ రోడ్డులోకి రావు. అక్కడ రైల్వే అండర్ పాస్ ఉంది. అందుకే ఆ మార్గం గుండా హెవీ వెహికల్స్ రావు. అయినా సరే ఓ భారీ లారీ వచ్చింది. అక్కడే పెద్ద చిక్కొచ్చింది. అధికారులకు చెమటలు పట్టించింది. ఈ మార్గంలో అనుకోకుండా ఒక హెవీ లారీ వచ్చింది. అందులో ఎరువుల బస్తాలున్నాయి. అయినా అండర్ పాస్ నుండి లారీని పోనిచ్చే ప్రయత్నం చేశాడు డ్రైవర్. దీంతో ఒక్కసారిగా లారీ ఆ బారీకేడ్స్‌ను ఢీ కొట్టి ట్రాక్ కింద నిలిచిపోయింది. ముందుకు, వెనక్కు కదలలేకపోయింది. దీంతో ఆందోళనకు గురయ్యాడు లారీ డ్రైవర్. ఈ ప్రక్రియ చాలా సేపు జరగడంతో.. అండర్ పాస్ కు అటూ ఇటూ ట్రాఫిక్ స్తంభించింది. ఈ మార్గం చాలా బిజీగా ఉంటుంది. ఇది చెన్నై, విజయవాడ వెళ్లే ప్రధాన రైలు మార్గం కావడం, ట్రాక్ కింద హెవీ లోడ్ తో ఉన్న లారీ ఇరుక్కుపోవడంతో అధికారులు హైరానా పడ్డారు. మరోవైపు ఆ మార్గం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లేది కావటంతో మరింత కంగారు పడ్డారు. ఒకానొక దశలో లారీని తొలగించేందుకు పెద్ద క్రేన్ ను తీసుకొచ్చారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. బారికేడ్‌ను ఢీకొట్టిన సమయంలో పెద్ద ఇనుప కమ్మె విరిగిపోయి లారీపై పడింది. దీంతో లారీని కదలించడం కూడా సాధ్యం కాలేదు. అయితే క్రేన్ సాయంతో తొలగించే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే లారీలో ఉన్న ఎరువుల బస్తాల్లో ఎరువంతా రోడ్డుపాలైంది. అదే సమయంలో గూడ్స్ రైలు రావడంతో ముందు జాగ్రత్తగా కొద్ది సేపు ఆ రైలును నిలిపివేశారు. దాదాపు రెండు గంటల ప్రయత్నం తర్వాత ట్రాక్ కింద ఇరుక్కుపోయిన లారీని తీయగలిగారు అధికారులు. ట్రాక్ కు ఎటువంటి డ్యామేజ్ కాకుండానే లారీని తీయడంతో అటు రైల్వే అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..