Dalphin: పిల్ల కాలువలో ప్రత్యక్షమైన డాల్ఫిన్.. డాల్ఫిన్‌ చూసేందుకు ఎగబడ్డ స్థానికులు. వైరల్ వీడియో..

Updated on: Feb 10, 2023 | 9:59 PM

సముద్రంలో, నదీ జలాల్లో ఉండాల్సిన డాల్ఫిన్‌ కాలువలో ప్రత్యక్షమైంది. కాకినాడ జిల్లా పెదపూడి కాలువలో డాల్ఫిన్‌ హల్‌చల్‌ చేసింది. పెదపూడి లోని బిక్కవోలులో ఓ డ్రైనేజీలో కనిపించిన

సముద్రంలో, నదీ జలాల్లో ఉండాల్సిన డాల్ఫిన్‌ కాలువలో ప్రత్యక్షమైంది. కాకినాడ జిల్లా పెదపూడి కాలువలో డాల్ఫిన్‌ హల్‌చల్‌ చేసింది. పెదపూడి లోని బిక్కవోలులో ఓ డ్రైనేజీలో కనిపించిన ఈ డాల్ఫిన్‌ను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. కాగా ఈ డాల్ఫిన్‌ సముద్రం నుంచి ఉప్పుటేరుద్వారా ఏలూరులోని పిల్ల కాల్వలోకి ప్రవేశించింది. కాల్వలో నీరు తక్కువగా ఉండటంతో నీటిలో ఆడుతున్న డాల్ఫిన్‌ ను గుర్తించిన స్థానిక మత్స్యకారులు సంబంధిత అధికారులకు సమాచారమిచ్చారు. ఈ వార్త ఆనోటా ఈనోటా ఆ ప్రాంతమంతా పాకింది. దాంతో డాల్ఫిన్‌ను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. మత్స్యకారుల సహాయంతో డాల్ఫిన్‌ను సముద్రంలో వదిలేందుకు ప్రయత్నించారు రెవెన్యూ, అటవీశాఖ అధికారులు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే..డాల్ఫిన్‌ను సముద్రం వద్దకు తీసుకెళ్లి నీటిలో వదిలే సమయానికి అది మృతి చెందింది. దాంతో పశుసంవర్ధకశాఖ వైద్యులతో పంచనామా జరిపించి పూడ్చిపెడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 10, 2023 09:59 PM