Pune Girl Molestation: దుర్మార్గానికి పరాకాష్ట.. బాలికపై తండ్రి, మామ, తాత అఘాయిత్యం..! ఛీ వీళ్ళు అసలు మనుషులేనా..

Updated on: Nov 22, 2022 | 9:57 AM

నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఓ దారుణం వెలుగులోకి వచ్చింది.


నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, మామ ముక్కుపచ్చలారని బాలికపై అఘాయిత్యానికి ఒడిగటంట్టారు. వావి వరుసలు మరిచి మృగాల్లా ప్రవర్తించారు. పలు సందర్భాల్లో తండ్రితోపాటు ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వచ్చి పుణెలో నివాసం ఉంటోన్న 17 ఏళ్ల బాలిక.. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడంతో షాకయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక.. ప్రస్తుతం చదువుతున్న కళాశాలలో లైంగిక వేధింపులపై కమిటీ సభ్యుల ముందు.. తన ఆవేదన వెళ్లబోసుకుంది. తన గోడును వారికి వినిపించడంతో.. తన జీవితంలో జరిగిన భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను సొంతూరులో ఉన్న సమయంలో.. తన మామ, తాత పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. పుణే వచ్చిన తర్వాత ఈ దారుణ ఘటనల గురించి తన తండ్రికి ఓ చీటీలో రాసి ఇచ్చానని తెలిపింది. వారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా.. తల్లి ఇంట్లోలేని సమయంలో తనపై పలు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని వివరించింది. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us