ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
నంద్యాల జిల్లా మహానంది మండలం బొల్లవరం గ్రామంలో ఓ ఇంటి పెరట్లో 8 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్‌క్యాచర్ మోహన్ స్థానికుల సహాయంతో పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు తరలించారు. వర్షాకాలంలో పాముల సంచారం పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వర్షాకాలం ప్రారంభంతోనే పాములు సంచారం ఎక్కువైంది. కురుస్తున్న భారీ వర్షాలకు ఆవాసాలు కోల్పోయిన పాములు జనావాసాల్లో సంచరిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లు, స్కూళ్లు, పట్టణాలు, పల్లెలు ఇలా ఎక్కడపడితే అక్కడ పాములు సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లా మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన కొండల్ అనే వ్యక్తి ఇంటి పెరట్లో సోమవారం ఒక భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. పెరటి వైపు నుంచి వింత శబ్దాలు రావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూశారు. అక్కడ పెద్ద కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన వారికి వెన్నులో వణుకు పుట్టింది. తీవ్ర భయాందోళనకు గురైన వారు.. ప్రాణభయంతో అక్కడినుంచి పరుగుతీశారు. వెంటనే వారు ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. స్పందించిన గ్రామస్థులు వెంటనే స్థానిక స్నేక్‌క్యాచర్ మోహన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్‌క్యాచర్ మోహన్, స్థానికుల సహాయంతో చాకచక్యంగా ఆ కొండచిలువను బంధించారు. సుమారు 8 అడుగుల పొడవు ఉన్న ఈ భారీ కొండచిలువను ఎట్టకేలకు పట్టుకోవడంతో కొండల్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు కూడా పెద్ద గండం తప్పిందంటూ ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన కొండచిలువను సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..
సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా
మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్
దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం!
కాకతీయ వైభవానికి మరో మకుటం.. ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!
