Train: డీజిల్ కోసం 100 కి.మీ. వెనక్కి వచ్చిన ట్రైన్ ఇంజిన్.. ఆగిపోయిన గూడ్స్ రైలు
ఉత్తరప్రదేశ్‌లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. రెండు రైల్వే డివిజన్ల మధ్య నెలకొన్న వివాదంతో.. ఇంధనం నింపుకోవడంకోసం ఓ గూడ్స్ రైలు ఇంజిన్ ఏకంగా 100 కిలోమీటర్లు వెనక్కి రావలసి వచ్చింది. అక్టోబరు 21న ఆగ్రా డివిజన్‌కు చెందిన ఓ గూడ్స్ రైలు మధుర నుంచి మధ్యాహ్నం 3 గంటలకు జైపూర్‌కి బయలుదేరింది. డీగ్ స్టేషన్ వద్ద ఆ రైలుకు సంబంధించిన విద్యుత్ ఇంజిన్ మార్చి, దాని స్థానంలో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు.
ఉత్తరప్రదేశ్‌లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. రెండు రైల్వే డివిజన్ల మధ్య నెలకొన్న వివాదంతో.. ఇంధనం నింపుకోవడంకోసం ఓ గూడ్స్ రైలు ఇంజిన్ ఏకంగా 100 కిలోమీటర్లు వెనక్కి రావలసి వచ్చింది. అక్టోబరు 21న ఆగ్రా డివిజన్‌కు చెందిన ఓ గూడ్స్ రైలు మధుర నుంచి మధ్యాహ్నం 3 గంటలకు జైపూర్‌కి బయలుదేరింది. డీగ్ స్టేషన్ వద్ద ఆ రైలుకు సంబంధించిన విద్యుత్ ఇంజిన్ మార్చి, దాని స్థానంలో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. అనంతరం ఆ రైలు ఉట్‌వాడ్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ రైలును తమ డివిజన్‌లోకి అనుమతించమని జైపూర్ డివిజన్ తెలిపింది. ఆ రైలులో కేవలం 2,300 లీటర్ల డీజిల్ మాత్రమే ఉందని, రైలు గమ్యస్థానం చేరడానికి అది సరిపోదని తెలిపింది. మధ్యలో రైలు ఆగిపోతే ఇతర రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతాయని స్పష్టం చేసింది. అంతేకాదు, వారి డివిజన్‌లో డీజిల్ ని నింపుకోడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. దాంతో చేసేదిలేక ఆగ్రా డివిజన్ గూడ్స్ రైలు ఇంజిన్ వెనుదిరగాల్సి వచ్చింది. రాత్రి ఏడున్నర గంటల సమయంలో రైలు నుంచి ఇంజిన్ ను విడదీసి, 100 కిలోమీటర్ల దూరం వెనుకకు వెళ్లి మధుర స్టేషన్‌లో డీజిల్ నింపుకొని వచ్చి, ఇంజిన్‌ను వ్యాగన్లతో జతచేసారు. చివరకు 10 గంటలపాటు ఉట్‌వాడ్ స్టేషన్‌లోనే వెయిట్ చేసిన గూడ్స్ రైలు… మర్నాడు ఉదయం ఐదున్నర గంటలకు బయలుదేరి జైపూర్ చేరుకుంది. ఈ ఘటనపై విచారణ జరుపుతామని రెండు డివిజన్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..