Watch Video: కదులుతున్న ట్రక్కుపై రోమాలు నిక్కపొడిచే సీన్.. చూస్తే ఔరా అనాల్సిందే..

| Edited By: Srikar T

May 25, 2024 | 4:48 PM

ఇటీవల చైన్ స్నాచింగ్ కేసులు ఏ రేంజ్‌లో పెరిగిపోయాయో మనం చూస్తూనే ఉన్నాం. అదే క్రమంలో దారి దోపిడీలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కార్ల అద్దాలు పగలుకొట్టి డబ్బు, విలువైన వస్తువులు దోచుకెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇక్కడ నేరగాళ్లు ఏకంగా రన్నింగ్‌లో ఉన్న ట్రక్కునే టార్గెట్ చేశారు. సినిమా స్టైల్లో దానిలోని వస్తువులను కొట్టేసి.. ఆ తరువాత బైక్‌పై ఎస్కేప్ అయ్యారు.

ఇటీవల చైన్ స్నాచింగ్ కేసులు ఏ రేంజ్‌లో పెరిగిపోయాయో మనం చూస్తూనే ఉన్నాం. అదే క్రమంలో దారి దోపిడీలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కార్ల అద్దాలు పగలుకొట్టి డబ్బు, విలువైన వస్తువులు దోచుకెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇక్కడ నేరగాళ్లు ఏకంగా రన్నింగ్‌లో ఉన్న ట్రక్కునే టార్గెట్ చేశారు. సినిమా స్టైల్లో దానిలోని వస్తువులను కొట్టేసి.. ఆ తరువాత బైక్‌పై ఎస్కేప్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో ఈ ఘటన జరిగిందని అంటున్నారు.

ఆగ్రా- ముంబై నేషనల్ హైవేపై వెళుతున్న ఓ ట్రక్కుపై నుంచి ఇద్దరు వ్యక్తులు ఓ మూటను తొలుత రోడ్డుపై జారవేయడం వీడియోలో కనిపించింది. ఆ తరువాత ట్రక్కుకు వెనుక భాగంలో వస్తున్న బైక్‌పై దిగడం విస్మయానికి గురిచేస్తోంది. అటుగా వెళుతున్న వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ధూమ్‌’ మూవీలో చూపించిన దానికంటే మించి మీ దారి దోపిడీ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…