వామ్మో.. రాకాసి అలలు.. ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలం..
ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. అల్పపీడనం కారణంగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్‌రోడ్డు మీదుగా కాకినాడ పరిసర ప్రాంతాలకు బైక్‌లపై వెళ్లే ప్రయాణికులు కెరటాల ధాటికి హడలెత్తిపోతున్నారు. తీర ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించడానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ వెళ్లారు.
కాకినాడ.. ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. అల్పపీడనం కారణంగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్‌రోడ్డు మీదుగా కాకినాడ పరిసర ప్రాంతాలకు బైక్‌లపై వెళ్లే ప్రయాణికులు కెరటాల ధాటికి హడలెత్తిపోతున్నారు. తీర ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించడానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ వెళ్లారు. ఉప్పాడ బీచ్ దగ్గర ఆయనపైకి అలలు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. ఎగసిపడుతున్న అలల ఉధృతిని చూసి స్థానికులను అప్రమత్తం చేశారు. గ్రామస్తులను, మత్స్యకారులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. సముద్రపు నీరు గ్రామంలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని వర్మ హామీ ఇచ్చారు.
ఇదిలాఉంటే.. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.
ఇది కూడా చదవండి..
Rain Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
