Andhra: తెల్లారి వాకింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా భయానక దృశ్యం.. ఆమె ఏం చేసిందంటే
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పని మీద పోస్టాఫీసు వెళ్లిన ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాక్కుని వెళ్లారు దుండగులు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.
నందిగామలో వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయ్. స్థానిక కెవిఆర్ కళాశాల సమీపంలోని పోస్టాఫీస్ ఎదురుగా నిలుచున్న మహిళ మెడలో నుంచి చైన్ లాక్కుని వెళ్లారు దుండగులు. పల్సర్ బైక్‌పై వచ్చి.. మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్ళిపోయారు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు. సదరు మహిళ ఉదయం వాకింగ్‌కి వచ్చి.. తిరిగి ఇంటికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. సుమారు 70 గ్రాముల బంగారు గొలుసును అపరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. మహిళ మెడలో గోలుసు లాక్కెళ్ళిన దృశ్యాలు సిసిటివిలో రికార్డు అయ్యాయి. అటు నందిగామ మునగచెర్ల సమీపంలోని కిరాణా షాపులో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాపులో సుమారు 2 లక్షల రూపాయల వస్తువులు చోరీ చేశారు. షాపు వెలుపల రక్తపు మరకలు ఉండగా.. దోంగతనం సమయంలో దొంగలకు గాయాలు అయ్యాయి. కాగా, ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రెండు దొంగతనాలు ఒకే దొంగలు చేశారా.? లేదా.? అని కూపీ లాగుతున్నారు.