భక్తులారా జర జాగ్రత్త! వాట్సాప్‌లో టికెట్లు బుక్ చేసి.. తిరుమల వెళ్తే ఊహించని షాక్!
టీటీడీ లోగోతో వచ్చిన వాట్సాప్ లింక్‌ను నమ్మిన అన్నమయ్య జిల్లా సుండుపల్లికి చెందిన ఓ కుటుంబం నకిలీ వీఐపీ దర్శనం టికెట్లతో మోసపోయింది. ఒక్కో టికెట్‌కు రూ.500 చొప్పున మూడు టికెట్లు కొనుగోలు చేసి తిరుమలకు వెళ్లగా, కౌంటర్ వద్ద అవి నకిలీవని తేలింది. దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భక్తులు అధికారిక టీటీడీ మార్గాల్లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
వాట్సాప్‌లో టికెట్లు బుక్ చేసి తిరుమలకు వెళ్లిన ఓ కుటుంబానికి చివరకు నిరాశే ఎదురైంది. టీటీడీ లోగోతో వచ్చిన లింక్‌ను నమ్మి ఒక్కొక్కటి రూ.500 చొప్పున మూడు వీఐపీ దర్శనం టికెట్లు కొనుగోలు చేశారు. తీరా దర్శన కౌంటర్ దగ్గరకు వెళ్లాక అవి నకిలీవని తేలింది. అసలు ఆ కుటుంబం ఎలా మోసపోయింది? భక్తులు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవాలనే ఆశతో తిరుమలకు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. వాట్సాప్‌లో వచ్చిన నకిలీ లింక్ ద్వారా దర్శనం టికెట్లు కొనుగోలు చేయగా.. కౌంటర్ వద్ద అవి నకిలీవని తేలడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లికి చెందిన ఆర్‌ఎంపీ వై. యల్లయ్య అనే వ్యక్తి మొబైల్‌కు ఈ నెల 5న టీటీడీ అధికారిక లోగోతో ఉన్న ఓ యాప్ లింక్ వాట్సాప్ గ్రూప్ ద్వారా వచ్చింది. స్వామివారి దర్శనం సులభంగా లభిస్తుందనే నమ్మకంతో.. మరొకరి సహాయంతో ఆ లింక్‌ను ఓపెన్ చేసి, ఒక్కొక్కటి రూ.500 చొప్పున మూడు వీఐపీ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫోన్‌కు వచ్చిన కన్ఫర్మేషన్ స్లిప్పులను జిరాక్స్ సెంటర్‌లో ప్రింట్ తీసుకున్నారు. ఆ పత్రాల్లో అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు దర్శన సమయం కేటాయించినట్లు ఉండటంతో కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు.. కానీ.. వీఐపీ దర్శనం కౌంటర్ వద్దకు చేరుకున్నాక అసలు విషయం బయటపడింది. తమ వద్ద ఉన్న టికెట్ల ప్రింట్లను టీటీడీ సిబ్బందికి చూపించగా.. అవి దేవస్థానం జారీ చేసిన అసలైన టికెట్లు కావని, నకిలీవని తేల్చిచెప్పారు. దీంతో యల్లయ్య కుటుంబం తీవ్ర నిరాశకు గురైంది. సర్వదర్శనం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే అవకాశం లేకపోవడంతో దర్శనం చేసుకోకుండానే స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ఘటనపై బాధితుడు వై.యల్లయ్య తిరుమల పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నకిలీ లింక్‌ను నమ్మి మోసపోయిన ఆయన.. ఇతర భక్తులు కూడా ఇలాంటి అనుమానాస్పద యాప్‌లు, వాట్సాప్ లింక్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తక్కువ ధరకు వీఐపీ దర్శనం టికెట్లు వస్తాయనే ఆశతో గుర్తుతెలియని లింక్‌లను నమ్మవద్దని హెచ్చరించారు. అదేవిధంగా, టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు, సందేశాల ద్వారా భక్తులను మోసం చేసే ప్రమాదం ఉంది. అందుకే దర్శన టికెట్లు బుక్ చేసుకునే ముందు వెబ్‌సైట్ అధికారికమైందో కాదో నిర్ధారించుకోవాలి. వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఓపెన్ చేయకూడదు. ముఖ్యంగా తెలియని వ్యక్తులకు డబ్బులు చెల్లించకూడదు. టికెట్లు బుక్ చేసుకునేందుకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారికంగా ప్రకటించిన మార్గాలనే ఉపయోగించాలి. మొత్తంగా.. శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి భక్తులు అప్రమత్తంగా ఉండాలి. టీటీడీ లోగో కనిపించిన వెంటనే లింక్‌ని ఓపెన్ చేసి.. టికెట్స్ బుక్ చేయకూడదు. అధికారిక మార్గాల ద్వారానే టికెట్లు బుక్ చేసుకుని ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. బీ కేర్ఫుల్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూర్యకుమార్ యాదవ్ లగ్జరీ హోమ్.. షారుఖ్ ఖాన్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి!
కార్లలో ఇక ఆటోమేటిక్ బ్రేకులు! 2032 నుంచి కొత్త రూల్? డ్రైవర్ బ్రేక్ వేయకున్నా..కారే ఆగుతుంది!
అటు భర్త.. ఇటు లవర్.. ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం.. అంటూ..
యజమాని కోసం.. ఎనిమిదేళ్లుగా ఆసుపత్రిలోనే తిరుగుతున్న కోడిపుంజు!
భారత్‌లో ఈ 9 నగరాలు టాప్!
కుక్కను చూసి చిరుత పరుగో.. పరుగు.. ఏం జరిగిందో మీరే చూడండి!
కోతుల బెడదకు చెక్.. బామ్మగారి ఐడియా అదిరిందిగా!
అత్తారింటికి దారేది? అయ్యో.. ఈ నవ వధువుకి ఎంత కష్టం వచ్చింది!
పెట్రోలును మంచినీళ్లలా తాగేసిన యువకుడు!

