తొలి సెంచరీపై తిలక్ వర్మ కామెంట్లు

Updated on: Apr 22, 2026 | 2:40 PM

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో అంతకంటే లోయరార్డర్‌లో వచ్చి సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగాడు తిలక్ వర్మ.

మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. విధ్వంసకర శతకంతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐదో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీని అందుకున్నాడు.తాజాగా ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ను తిలక్ వర్మ అందుకున్నాడు. మ్యాచ్ తర్వాత తన ఇన్నింగ్స్ కోసం కొత్తగా ఏమీ చేయలేదని, తన సామర్థ్యాలపై నమ్మకం ఉంచి సహజ శైలిలో ఆడినట్లు తిలక్ వర్మ చెప్పాడు. మొదటి 20 బంతుల్లో ప్రతి బంతికి ఒక్కో పరుగు చేస్తూ క్రీజ్‌లో కుదురుకోవడం పైనే దృష్టిసారించానని, క్రీజ్‌లో కొంత సమయం గడిపి పిచ్‌ తీరును అర్థం చేసుకున్నానని తెలిపాడు. తన సామర్థ్యాలపై నమ్మకం ఉంచి సహజ శైలిలోనే ఆడినట్లు తిలక్ అన్నాడు.

మరిన్ని వీడియోల కోసం :

సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్‌.. రీజనేంటి?

పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?

పాన్ ఇండియా హిట్‌ వరమా..శాపమా?

ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?

సమ్మర్‌ హీట్‌.. లైట్‌ అంటున్న స్టార్స్‌

Follow Us