Corona Cases: దేశంలో కరోనా కొత్తవేరియంట్ కలకలం.. కేరళలో పెరుగుతున్న కేసులు.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వణికిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఈ వైరస్‌కు చెందిన వివిధ వేరియంట్లు ప్రజలలో ఆందోళన పెంచుతూనే ఉన్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్‌వేరియంట్‌ను తొలుత లక్సెంబర్గ్‌లో గుర్తించారు. ఆ తర్వాత జేఎన్.1 కేసులు యూకే, ఐస్‌లాండ్, ఫ్రాన్స్, అమెరికాలో కూడా వెలుగు చూశాయి.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వణికిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఈ వైరస్‌కు చెందిన వివిధ వేరియంట్లు ప్రజలలో ఆందోళన పెంచుతూనే ఉన్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్‌వేరియంట్‌ను తొలుత లక్సెంబర్గ్‌లో గుర్తించారు. ఆ తర్వాత జేఎన్.1 కేసులు యూకే, ఐస్‌లాండ్, ఫ్రాన్స్, అమెరికాలో కూడా వెలుగు చూశాయి. తాజాగా ఈ సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసు భారతదేశంలోనూ వెలుగు చూసింది. జేఎన్.1 కేసు కేరళలో నిర్ధారితమయ్యింది. దీంతో కేరళ వైద్యశాఖలో మరోమారు ఆందోళనలు కమ్ముకున్నాయి.
కేరళలో గత కొన్ని రోజులుగా JN.1 వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో దేశంలో నమోదయ్యే మొత్తం రోజువారీ కరోనా కేసుల్లో కేరళలో అత్యధికంగా ఉంటున్నాయి. కేరళలో నవంబర్ నెల మొత్తం 470 కరోనా కేసులు నమోదు కాగా.. డిసెంబర్ నెల తొలి పది రోజుల్లోనే 825 మంది కరోనా బారినపడ్డారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1104కు పెరిగింది. కొత్త వేరియంట్ కారణంగా కేరళలో కరోనా కేసులు పెరగడం దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. దాంతో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 312 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 31 తర్వాత దేశంలో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో మొత్తం 17,605 మందికి పరీక్షలు నిర్వహించగా 312 మందికి పాజిటివ్‌గా తేలింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1296కు చేరింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్.. ఒక్క మాటతో
ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
సింహాల డెన్లోకి యువకుడు.. జరిగింది చూసి అంతా షాక్
భర్త చనిపోయినా.. ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
డ్రైవర్ కు ఫిట్స్ .. గాల్లోకి ఎగిరిన మెర్సిడస్ కారు..
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!

