అందం కోసం ఫేస్ క్రీమ్‌లు వాడుతున్నారా ? అయితే ఆసుపత్రిలో చేరాల్సిందే
అందం కోసం వాడే ఫేస్ క్రీమ్‌లు, బాడీ లోషన్లలో పారాబెన్స్, మెర్క్యూరీ వంటి విషపూరిత రసాయనాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి చర్మ క్యాన్సర్, కిడ్నీలు, లివర్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. WHO పరిశోధనలు ఈ ప్రమాదాలను నిర్ధారించాయి. వైద్యుల సలహా మేరకు మాత్రమే క్రీములు వాడాలని, అధిక వినియోగం ప్రాణాంతకం అని నిపుణులు సూచిస్తున్నారు.
అందం కోసం వాడే ఫేస్ క్రీమ్‌లు, బాడీ లోషన్లు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిలో పారాబెన్స్, ఫ్రాతాలేట్స్, హైడ్రో క్వినోన్, స్టెరాయిడ్లు, పాదరసం వంటి విషపూరిత రసాయనాలు అధిక మోతాదులో ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పరిశోధనలో తేలింది. ఈ రసాయనాలు చర్మ రంధ్రాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి, రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా చర్మ క్యాన్సర్, లివర్, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్, ఈస్ట్రోజన్ హార్మోన్ల అసమతుల్యత వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కేరళలో ఒక యువతి బాడీ లోషన్లలో పాదరసం ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలు దెబ్బతిన్న సంఘటన నిదర్శనం. క్రీములలో రసాయనాల శాతం 40% మించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్లైన్లో దొరికే క్రీములను అడ్డగోలుగా వాడకుండా, డాక్టర్ సలహా మేరకు, శరీరానికి తగిన క్రీములను మాత్రమే ఎంచుకోవాలి. అధిక మోతాదులో, రోజుకు అనేకసార్లు వాడటం మానుకోవాలి. లేదంటే భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టూరిస్ట్ కేంద్రాల్లో పండగ సందడి.. వచ్చే ఏడాది నుంచి ఫెస్టివల్స్‌కు ప్రభుత్వం ప్లాన్
పర్ఫెక్ట్ ఓనర్…ఇళ్ల అద్దెతో నెలకు రూ. 75 లక్షలు సంపాదన!
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై యూపీఐ, ఏటీఎం ద్వారా సులభంగా విత్‌డ్రా
