తల్లిదండ్రులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్.. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇక వాట్సప్‌కే వచ్చేస్తుంది

Updated on: Nov 08, 2026 | 9:00 AM

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల SA-1 పరీక్షల ప్రోగ్రెస్‌ కార్డులను తల్లిదండ్రులకు వాట్సాప్‌ ద్వారా పంపేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పిల్లల మార్కులు, సబ్జెక్టుల వారీగా ప్రతిభ వివరాలు నేరుగా మొబైల్‌లో తెలుసుకోవచ్చు. మరోవైపు ప్రైవేట్‌ పాఠశాలలు విద్యార్థులు, ఉపాధ్యాయుల రోజువారీ హాజరును ISMS పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఆదేశించారు.

‘సార్ మా వాడు ఎలా చదువుతున్నాడు? ఈసారి మా అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చాయి? మంచిగా చదువుతున్నారా..? లేదా..? రోజూ బడికి వస్తున్నారా…? బడికి వెళ్లిన తల్లిదండ్రులు.. అక్కడి ఉపాధ్యాయులను తరచూ అడిగే మాటలివి. దీనికోసం వాళ్లు పనిగట్టుకొని స్కూలుకు వెళ్లి కాసేపు ఇలా ఆరా తీసి వస్తుంటారు. అయితే.. ఇకపై మీ పిల్లలకు పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయి? ఏ సబ్జెక్ట్‌లో తక్కువ వస్తున్నాయి.. ఎలా చదువుతున్నారు.. అని తెలుసుకోవడానికి ఇకపై స్కూళ్లకు తిరగాల్సిన పనిలేదు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తల్లిదండ్రులందరికీ మైండ్ బ్లోయింగ్ గుడ్‌న్యూస్ చెప్పింది! ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షల ప్రోగ్రెస్ కార్డులను ఇకపై నేరుగా WhatsApp ద్వారానే మీ మొబైల్‌కు పంపబోతోంది.. అసలు ఈ వాట్సాప్ సదుపాయాన్ని ఎలా పొందాలి? పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రైవేట్ పాఠశాలలకు జారీ చేసిన కఠిన ఆదేశాలేంటో ఈ రోజు వీడియోలో ఇన్-డెప్త్‌గా చూద్దాం! పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. మీ పిల్లల చదువుల పురోగతిని తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ప్రతీసారి స్కూలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. విద్యార్థులు పరీక్షల్లో ఎలా రాణించారు? ఏయే సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించారు? వారి విద్యా స్థాయి ఎలా ఉంది? అనే వివరాలతో కూడిన పూర్తి ప్రోగ్రెస్ కార్డును మీ ఫోన్‌లోని వాట్సాప్‌లోనే పొందేందుకు ఏర్పాట్లు చేశారు. SAలో వచ్చిన మార్కుల ఆధారంగా రిపోర్ట్ ను ఫోన్లకు నేరుగా పంపిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ కీలక ప్రకటన చేశారు.. తల్లిదండ్రులందరూ ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇది మాత్రమే కాదు… రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు కూడా విద్యాశాఖ డైరెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు! విద్యార్థులు – ఉపాధ్యాయుల రోజువారీ హాజరు వివరాలను ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్.. ISMS పోర్టల్‌లో క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు. దీనిలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన పెండింగ్ హాజరు వివరాలను వెంటనే అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. దీనికి గడువు కూడా విధించారు.. ఇకపై ప్రతి నెలకు సంబంధించిన హాజరును మరుసటి నెల 1వ తేదీలోగా తప్పనిసరిగా పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ హాజరు నమోదు ప్రక్రియ సక్రమంగా జరుగుతోందో లేదో పర్యవేక్షించే బాధ్యతను జిల్లా విద్యాశాఖ అధికారులకు.. అంటే DEOలకు అప్పగించారు. ప్రైవేట్ స్కూళ్లు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో తల్లిదండ్రులు, పాఠశాలలు నిరంతరం సమన్వయం చేసుకుంటూ.. వారి ప్రగతిపై దృష్టి సారించాలని తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిలుపునిచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీపావళిని 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?

బెంగళూరు నుంచి హైదరాబాద్‌ 2 గంటలే..

ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్‌.. వర్క్ ఫ్రమ్ పార్క్

నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణుదేశాయ్‌ కామెంట్స్‌ వైరల్‌

తెరపై నటులు.. కానీ నిజ జీవితంలో దొంగలు

Loading...
Unable to load recommendations.
Follow Us