తెలంగాణలో ఒంటిపూట బడులు – పూర్తి షెడ్యూల్ ఇదే

Updated on: Mar 13, 2026 | 6:14 PM

తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా, విద్యాశాఖ మార్చి 15 నుండి అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు అమలు చేయనుంది. ఉదయం 8 నుండి 12:30 వరకు తరగతులు జరుగుతాయి, అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తారు. SSC పరీక్షా కేంద్రాలలోని పాఠశాలలకు మాత్రం పరీక్ష రోజుల్లో మధ్యాహ్నం 1 నుండి 5 వరకు తరగతులుంటాయి. ఈ నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ వర్తిస్తుంది. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పనిదినం వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పని చేస్తాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మిడ్ డే మీల్స్ వడ్డిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో, విద్యార్థులకు సన్నద్ధత కోసం నిర్వహించే ప్రత్యేక తరగతులు యధావిధిగా కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల విషయంలో విద్యాశాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఏ పాఠశాలల్లో అయితే SSC పరీక్షా కేంద్రాలు ఉన్నాయో, ఆ పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 1:00 గంట నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేస్తాయి. పరీక్షలు లేని సాధారణ రోజుల్లో మాత్రం మిగిలిన పాఠశాలల వలె ఉదయం 8:00 నుండి 12:30 వరకు ఒంటిపూట బడులుగానే కొనసాగుతాయి. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ విద్యాధికారులు మరియు జిల్లా విద్యాశాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !! మీ కోసం సరికొత్త టెక్నాలజీ ప్రారంభం

ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి.. మల్లన్న దర్శనానికి పాదయాత్ర

క్షుద్రపూజల కలకలం.. శివారులో భయానక దృశ్యాలు !!

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. అయోధ్యలో భక్తులకు భోజన కష్టాలు

తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..

Follow Us