High-Speed Internet: ఒక్క సెకనులో 2 లక్షల సినిమాలు డౌన్​ లోడ్​.! ప్రపంచంలోనే హైస్పీడ్​ ఇంటర్నెట్​

|

Jul 30, 2024 | 9:22 PM

మీరు వాడే నెట్ స్పీడ్ ఎంత? మొబైల్ లో అయితే 4జీ, 5జీతో 100 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. ఇంట్లో పెట్టుకునే బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ ఒక GBPS వరకు ఉంటుంది. కానీ ఏకంగా 400 టీబీలకుపైగా ఇంటర్నెట్ స్పీడ్ తెలుసా? అంటే సెకనుకు 4 లక్షల GBPS స్పీడ్ అన్నమాట. యూకేలోని ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇంత స్పీడ్ ఇంటర్నెట్ ను సాధించగలిగారు. సాధారణంగా ఫైబర్ ఆఫ్టిక్ కేబుళ్లలో నిర్ణీత వేవ్ లెంగ్త్‌ ఉన్న కాంతిని ఉపయోగించి సమాచారాన్ని ప్రసారం చేస్తారు.

మీరు వాడే నెట్ స్పీడ్ ఎంత? మొబైల్ లో అయితే 4జీ, 5జీతో 100 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. ఇంట్లో పెట్టుకునే బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ ఒక GBPS వరకు ఉంటుంది. కానీ ఏకంగా 400 టీబీలకుపైగా ఇంటర్నెట్ స్పీడ్ తెలుసా? అంటే సెకనుకు 4 లక్షల GBPS స్పీడ్ అన్నమాట. యూకేలోని ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇంత స్పీడ్ ఇంటర్నెట్ ను సాధించగలిగారు.

సాధారణంగా ఫైబర్ ఆఫ్టిక్ కేబుళ్లలో నిర్ణీత వేవ్ లెంగ్త్‌ ఉన్న కాంతిని ఉపయోగించి సమాచారాన్ని ప్రసారం చేస్తారు. కాంతి ద్వారానే డేటా ట్రాన్స్ ఫర్ అవుతుంది. అయితే ఒకే వేవ్ లెంగ్త్‌ ఉన్న కాంతిని మాత్రమే కాకుండా.. వేర్వేరు వేవ్ లెంగ్త్‌ లు ఉన్న కాంతిని ఒకే సమయంలో ఉపయోగించడం ద్వారా శాస్త్రవేత్తలు హైస్పీడ్ ఇంటర్నెట్ ను సాధించగలిగారు. ఈ టెక్నాలజీకి జపాన్ శాస్త్రవేత్తలు అనుసరించిన విధానమే మూలం. కొన్నేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు కొన్ని నెలల కింద ఏకంగా 301 TBPS స్పీడ్ తో డేటాను ప్రసారం చేయగలిగారు. ఇప్పుడు అదే తరహా టెక్నాలజీని మరింత మెరుగుపరచి ఏకంగా 402 TBPS స్పీడ్ సాధించినట్టు ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఇయాన్ ఫిలిప్స్ వెల్లడించారు.

ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే 402 TBPS వేగం సాధించగలిగారు. అంటే కొత్తగా కేబుళ్లను మార్చాల్సిన అవసరం ఉండదు. కేవలం డేటాను ప్రసారం చేసే చోట, రిసీవ్ చేసుకునే చోట చిన్నపాటి పరికరాలు, యాంఫ్లిఫయర్లను వాడితే చాలని శాస్త్రవేత్త ఇయాన్ ఫిలిప్స్ వెల్లడించారు. త్వరలోనే ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఈ స్పీడ్ తో ఇంటర్నెట్ వస్తే.. ఒక్క సెకన్ లోనే దాదాపు 2 లక్షల సినిమాలను డౌన్ లోడ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే ఇంటర్నెట్ ఎంత స్పీడ్ తో వస్తుందో ఊహించండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on