భారతీయ సైంటిస్ట్ అద్భుత సృష్టి.. ఆవాలతో విమానాలకు ఇంధనం తయారీ.. వీడియో

భారతీయ సైంటిస్ట్ అద్భుత సృష్టి.. ఆవాలతో విమానాలకు ఇంధనం తయారీ.. వీడియో

Phani CH

|

Updated on: Oct 24, 2021 | 7:00 PM

భారతీయ శాస్త్రవేత్త పునీత్‌ ద్వివేది తన బృందంతో కలిసి చేసిన పరిశోధనల్లో ఓ అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. ఆవాల మొక్కల నుంచి తీసిన నూనెతో విమాన ఇంధనాన్ని తయారు చేయవచ్చని కనుగొన్నారు.

భారతీయ శాస్త్రవేత్త పునీత్‌ ద్వివేది తన బృందంతో కలిసి చేసిన పరిశోధనల్లో ఓ అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. ఆవాల మొక్కల నుంచి తీసిన నూనెతో విమాన ఇంధనాన్ని తయారు చేయవచ్చని కనుగొన్నారు. బ్రాసికా కేరినాటా రకం ఆవాల మొక్కల నుంచి తీసే నూనెతో విమానం ఇంధనం తయారు చేయవచ్చని పునీత్ ద్వివేది చెబుతున్నారు.అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో విమానాల ఇంధన ఖర్చులు ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు పెనుభారంగా మారిన ఈ సమయంలో పునీత్ ద్వివేది తెలిపిన ఈ విషయం విమాన సంస్థలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌.. 15 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో ‘సౌత్‌ఈస్ట్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రెన్యూవబుల్స్‌ ఫ్రమ్‌ కేరినాటా’ అనే ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భారత శాస్త్రవేత్త పునీత్‌ ద్వివేది కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత నాలుగేళ్లుగా యుఎస్‌ ఆగేయ అమెరికాలో కేరినాటా రకం ఆవాల మొక్కలను పెద్ద మొత్తంలో ఏ విధంగా పెంచాలి, వాటి నుంచి నూనె ఎలా సేకరించాలనే విషయంపై పరిశోధలు చేస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

జంప్‌ చేయాలనుకున్నాడు.. ఒక్క తన్ను తన్నింది..! నెట్టింట వైరల్‌.. వీడియో

Viral Video: ఈ ఊరిలో ప్రజలంతా రోడ్ మీద కాకుండా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఎందుకో తెలుసా..?? వీడియో