పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!

Updated on: Aug 03, 2026 | 8:11 AM

భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్మీ సర్జన్ మేజర్ జగత్‌కుమార్ పటేల్ ముక్కు ద్వారానే మెదడులోని పిట్యూటరీ కణితిని తొలగించే వినూత్న శస్త్రచికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. కపాలం తెరవాల్సిన అవసరం లేకుండా చేసిన ఈ ఎండోస్కోపిక్ సర్జరీతో రోగి రెండు రోజుల్లోనే కోలుకుని, కంటిచూపు కూడా మెరుగుపడింది. ఈ విధానాన్ని వైద్యరంగంలో కీలక పురోగతిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

వైద్య రంగంలో ఇదొక అద్భుతమైన పురోగతి. కపాలం తెరవాల్సిన అవసరం లేకుండా, కేవలం ముక్కు ద్వారా మెదడులోని కణితులను తొలగించే వినూత్న శస్త్రచికిత్స విధానాన్ని భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్మీ సర్జన్ అభివృద్ధి చేశారు. మేజర్ జగత్‌కుమార్ పటేల్ అనే ఈ సర్జన్, మరో ఆర్మీ న్యూరో సర్జన్‌తో కలిసి ఈ కొత్త పద్ధతికి రూపకల్పన చేశారు. ఈ విధానం ద్వారా రోగులు అతి తక్కువ సమయంలో కోలుకునే అవకాశం ఉందని పెంటగాన్ వెల్లడించింది. వాల్టర్ రీడ్ ఆర్మీ మెడికల్ సెంటర్‌లో మరో న్యూరో సర్జన్ లెఫ్టినెంట్ కల్నల్ చార్లెస్ మిల్లర్‌తో కలిసి ఈ వినూత్న శస్త్రచికిత్సను పూర్తిచేశారు. కొన్నాళ్లుగా తీవ్ర తలనొప్పి, చూపు మందగించడంతో బాధపడుతున్న మెరైన్ ఆఫీసర్ ఆండీ ఆర్చర్‌కు ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా, పిట్యూటరీ గ్రంథి వద్ద 4.4 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లు తేలింది. దీంతో పటేల్ ఎండోస్కోపిక్ కెమెరాతో ముక్కు ద్వారా దారి చూపిస్తుండగా, మిల్లర్ ఆ కణితిని అత్యంత జాగ్రత్తగా తొలగించారు. ఈ ఓపెన్ సర్జరీ లేని విధానం వల్ల రోగి కేవలం రెండు రోజుల్లోనే వేగంగా కోలుకోవడమే కాకుండా, కంటిచూపు కూడా మెరుగుపడింది. ఎలాంటి ఆపరేషన్ గాయాల ఆనవాళ్లు లేకుండా అతి తక్కువ సమయంలో కోలుకునేలా చేసిన ఈ సర్జరీపై పెంటగాన్ హర్షం వ్యక్తం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chicken Manchurian: మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే.. ఏ ఊరిదో తెలుసా?

విదేశాల్లో వర్క్‌ చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌!

లేడీ ఏసీపీ సాహసం… కదులుతున్న బస్సుకు ఎదురుగా నిలబడి

ఆహా స్కెచ్‌ అంటే నీదే బాస్‌.. అప్పు తీర్చడానికి ఏం ప్లాన్‌ చేసాడు..!

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ కొత్త రూల్స్‌ తెలుసుకోకపోతే నష్టమే!

Loading...
Unable to load recommendations.
Follow Us