రూ. 27,000 కోట్లు ఖర్చుతో మన శాటిలైట్లకు ‘బాడీగార్డులు’!

Updated on: Sep 24, 2025 | 6:46 PM

అంతరిక్షంలో ఉపగ్రహాలకు రక్షణగా నిలిచే "బాడీగార్డ్" ఉపగ్రహాలను అభివృద్ధి చేయాలని భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. .27,000 కోట్ల రూపాయలతో 50 ఇన్‌స్పెక్షన్ ఉపగ్రహాలను అభివృద్ధి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో మొదటి ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది ప్రయోగించనున్నారు. గతంలో ఇస్రోకు చెందిన ఒక ఉపగ్రహం కక్ష్యలో తిరుగుతున్నప్పుడు ఒక విదేశీ ఉపగ్రహం కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఎదురుపడింది.

ఈ ఉపగ్రహం చైనాకు చెందినదిగా భావిస్తున్నారు. ఇలాంటి అంతరిక్ష ముప్పులను ఎదుర్కొనేందుకు భారత్ అప్రమత్తమైంది. ఈ కొత్త “బాడీగార్డ్ ఉపగ్రహాలు” ఇతర ఉపగ్రహాల కదలికలను ట్రాక్ చేస్తాయి. అవసరాన్ని బట్టి మన ఉపగ్రహాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా, లేజర్ లైట్ టెక్నాలజీ ఉన్న బాడీగార్డ్‌ ఉపగ్రహాలు ముప్పును త్వరగా గుర్తించి, భూమిపై ఉన్న కమాండ్ సెంటర్లకు సమాచారాన్ని పంపుతాయి. దీని వల్ల భారత నిపుణులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం 930 చైనా ఉపగ్రహాలు వందకు పైగా భారత ఉపగ్రహాలు ఉన్నాయి. పెరుగుతున్న అంతరిక్ష పోటీ, భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని భారత్ ఈ రక్షణ సామర్థ్యాలను పెంచాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌లో స్వదేశీ స్టార్టప్ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించనుంది. ఈ చొరవ భవిష్యత్తులో అంతరిక్షంలో భారత రక్షణ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మవారికి గన్ సెల్యూట్! గూర్ఖా సైనికుల దుర్గాపూజ చాలా స్పెషల్

గురువారం.. జలగండం వచ్చే మూడు రోజులు.. దంచుడే

కరువు సీమ కాదు.. బంగారు సీమ ఆ గ్రామాల్లో లక్షల టన్నుల పసిడి

డాన్స్‌ క్లాస్ నుంచి మహిళ కిడ్నాప్‌.. సీన్ కట్ చేస్తే..

Suryapet: ఒకే స్తంభానికి 40కి పైగా సీసీ కెమెరాలు!