‘ఎక్స్‌’లో అదిరిపోయే ఫీచర్.. ఒక్క లైక్‌తో నేరుగా డబ్బులు పంపొచ్చు!

Updated on: Oct 28, 2026 | 11:17 AM

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో ఎలాన్‌ మస్క్‌ కొత్త చెల్లింపుల ఫీచర్‌ను ప్రకటించారు. పోస్ట్‌ కింద ఉన్న లైక్‌ బటన్‌ను కాసేపు నొక్కి ఉంచడం ద్వారా సృష్టికర్తకు ఒక డాలర్‌ పంపే సదుపాయం తీసుకురానున్నట్లు తెలిపారు. ఎక్స్‌ మనీ ద్వారా జరిగే ఈ చెల్లింపులు ప్రస్తుతం అమెరికాకే పరిమితం. భారత్‌లో ఈ ఫీచర్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ యూజర్లకు ఎలాన్ మస్క్ మరో అదిరిపోయే గుడ్ న్యూస్‌ చెప్పారు. ఎక్స్‌లో ఇకపై ఏదైనా పోస్ట్ నచ్చితే, దాని కింద ఉండే ‘లైక్’ బటన్‌ను కాసేపు నొక్కి ఉంచడం ద్వారా ఆ పోస్ట్ చేసిన సృష్టికర్తకు నేరుగా ఒక డాలర్ పంపే సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వినూత్న సదుపాయం ద్వారా ప్లాట్‌ఫామ్‌లోనే అత్యంత సులభంగా చిన్న మొత్తంలో డబ్బు పంపించుకునే అవకాశం కలుగుతుంది. ఈ కొత్త ఫీచర్‌ను ఎక్స్‌ను కేవలం సోషల్ నెట్‌వర్కింగ్ వేదికగానే కాకుండా, ఫైనాన్షియల్ సర్వీసులతో కూడిన ఒక పూర్తిస్థాయి ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చాలన్నది ఎలన్‌ మస్క్‌ లక్ష్యం. ఇందులో భాగంగానే “ఎక్స్ మనీ ద్వారా ఒకరికి 1 డాలర్ పంపడానికి లైక్ బటన్‌పై లాంగ్ ప్రెస్ చేసే సౌకర్యాన్ని తీసుకువస్తున్నాం” అని మస్క్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ ఫీచర్ ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు టిప్స్ రూపంలో ఆర్థికంగా మద్దతునివ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ చెల్లింపుల ప్రక్రియ అంతా ‘ఎక్స్ మనీ’ ద్వారా జరగనుంది. ఇటీవల అమెరికాలో ప్రారంభమైన ‘ఎక్స్ మనీ’ సేవలు పీర్-టు-పీర్ నగదు బదిలీలకు, డిజిటల్ చెల్లింపులకు అనుమతిస్తున్నాయి. అంతేకాకుండా, ఫిజికల్ మరియు డిజిటల్ లావాదేవీలకు ఉపయోగపడే ‘ఎక్స్ వీసా డెబిట్ కార్డ్’ను కూడా అందిస్తున్నారు. ఈ కార్డును యాపిల్ పేకు కూడా లింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ‘ఎక్స్ మనీ’ సేవలు, కొత్త లైక్ పేమెంట్ ఫీచర్ కేవలం అమెరికా మార్కెట్‌కే పరిమితం చేశారు. భారత్ సహా ఇతర దేశాల్లో ఈ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాలె పురుగు కుడితే అంత ప్రమాదమా!

పండగ రద్దీకి చెక్‌.. దీపావళికి స్పెషల్‌ రైళ్లుప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌ న్యూస్‌

పెన్షనర్లకు బిగ్ షాక్! డిసెంబర్ 31 లోపు ఇది చేయాల్సిందే.. లేకపోతే

చుక్క నీటిని వృథా చేసినా.. చుక్కలు చూస్తారు.. హైదరాబాద్ వాసులకు జలమండలి వార్నింగ్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. విలాసవంతమైన కార్లలో షో.. చివరికి

Loading...
Unable to load recommendations.
Follow Us