మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
పంజాబ్‌కు చెందిన చమన్ లాల్ అనే వృద్ధుడు తీర్థయాత్రలో కుటుంబం నుంచి తప్పిపోయి పొరపాటున బీహార్ వెళ్లే రైలు ఎక్కి గయా చేరుకున్నారు. అక్కడ నీరజ్ అనే స్థానికుడు ఆయనకు నాలుగు రోజులు ఆశ్రయం ఇచ్చాడు. వృద్ధుడు చెప్పిన గ్రామం పేరును గుర్తించేందుకు చాట్‌జీపీటీని ఆశ్రయించిన నీరజ్, లూధియానా సమీపంలోని ప్రాంతాన్ని గుర్తించాడు. చివరకు స్వయంగా వృద్ధుడిని అక్కడికి తీసుకెళ్లి కుటుంబంతో కలిపాడు.
రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ మానవులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. తాజాగా తీర్థయాత్రలో కుటుంబం నుంచి తప్పిపోయిన ఓ వృద్ధుడిని సాంకేతికత ఆధారంగా ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిపాడు. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది. పంజాబ్‌కు చెందిన చమన్ లాల్ అనే వృద్ధుడు ప్రభుత్వ తీర్థయాత్ర పథకంలో భాగంగా అమృత్‌సర్ వెళ్లాడు. మతిమరుపుతో తీర్థయాత్రలో తప్పిపోయి 1,200 కిలోమీటర్లు దాటి వెళ్లిపోయాడు. మతిమరుపు కారణంగా బృందం నుండి విడిపోయిన ఆయన, పొరపాటున బీహార్ వెళ్లే రైలు ఎక్కి గయా స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆందోళన, ఆకలితో అల్లాడుతున్న ఆ వృద్ధుడిని అక్కడ నిర్మాణ రంగంలో పనిచేసే నీరజ్ అనే స్థానికుడు గమనించాడు. ఆయనను తన ఇంటికి తీసుకెళ్లి, ఆహారం ఇచ్చి నాలుగు రోజులు ఆశ్రయం కల్పించాడు. చమన్ లాల్‌ను వివరాలు అడగ్గా, తన ఊరి పేరు ‘ఫతేగఢ్ గుజ్రాన్’ అని పంజాబీలో చెప్పాడు. పంజాబ్ గురించి తెలియని నీరజ్, ఆ ఊరి ఆచూకీ కోసం చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. చాట్‌జీపీటీ సాయంతో ఆ గ్రామం లూధియానా జిల్లాలోని మచ్చివారా సాహిబ్ సమీపంలో ఉందని తెలుసుకున్నాడు. వృద్ధుడి పరిస్థితిని అర్థం చేసుకున్న నీరజ్… వృద్ధుడిని ఒంటరిగా పంపించకుండా.. స్వయంగా రైలులో లూధియానాకు తీసుకువెళ్లాడు. మచ్చివారాలో చమన్ లాల్ ఫోటో చూపిస్తూ వాకబు చేసాడు. స్థానిక ఉపాధ్యాయుడు ఒకరు ఆయనను గుర్తించి కుటుంబానికి సమాచారం అందించారు. తీవ్రంగా గాలిస్తున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వృద్ధుడిని కలిశారు. దేవుడిలా వచ్చి తమ తాతను అప్పగించిన నీరజ్‌ను గ్రామానికి తీసుకెళ్లి పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐఫోన్‌కు స్క్రీన్ ప్రొటెక్టర్ అక్కర్లేదు!ఎందుకంటే..
పిల్లలకు దగ్గు సిరప్ ఇచ్చేవారికి కేంద్రం హెచ్చరిక!
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు.. శంకర్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
చైనా ‘బిలిబిలి’వైపు భారత కంటెంట్ క్రియేటర్ల చూపు
మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన