రిటైరైనా తగ్గని క్రేజ్.. బ్రాండ్ రేసులో దూసుకెళ్తున్న మాస్టర్‌ బ్లాస్టర్‌

Updated on: Aug 09, 2026 | 4:58 PM

క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి ఏళ్లు గడిచినా సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. ‘క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2025’ నివేదిక ప్రకారం సచిన్ బ్రాండ్ విలువ 125.9 మిలియన్ డాలర్లు, సుమారు రూ.1,189 కోట్లు. దేశంలోని టాప్-5 సెలబ్రిటీ బ్రాండ్లలో చోటు దక్కించుకున్న ఆయన, టాప్-10లో ఉన్న ఏకైక రిటైర్డ్ క్రీడాకారుడిగా నిలిచారు. మైదానంలోని రికార్డులతో పాటు విశ్వసనీయత ఆయన బ్రాండ్ బలాన్ని మరింత పెంచుతోంది.

క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలు రేసులో ఉన్నప్పటికీ, రిటైర్డ్ అథ్లెట్‌గా సచిన్ సృష్టిస్తున్న బ్రాండ్ వాల్యూ రికార్డులు సరికొత్త చరిత్రను తిరగరాస్తున్నాయి. ‘క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2025’ నివేదిక ప్రకారం, సచిన్ బ్రాండ్ విలువ ఏకంగా 125.9 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 1,189 కోట్లు. దీంతో ఆయన దేశంలోనే టాప్-5లో స్థానం సంపాదించాడు. విశేషమేమిటంటే.. ఈ జాబితాలో టాప్-10లో నిలిచిన ఏకైక రిటైర్డ్ క్రీడాకారుడు సచిన్ కావడం. ఏటా అత‌ని బ్రాండ్ విలువ పెరుగుతూనే ఉండటం గమనార్హం. సచిన్‌పై ప్రజల్లో ఉన్న అపారమైన నమ్మకం, విశ్వసనీయత, తరగని కీర్తిప్రతిష్టలే ఈ స్థాయి బ్రాండ్ విలువకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మైదానంలో పదేపదే రికార్డులను తిరగరాసిన మాస్టర్ బ్లాస్టర్, అంతర్జాతీయ కెరీర్‌లో ఏకంగా 34,357 పరుగులు సాధించి సార్వకాలిక అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ అత్యధిక సెంచరీల రికార్డు ఆయన పేరిటే ఉంది. వన్డేల్లో 79వ మ్యాచ్ వరకు తొలి సెంచరీ చేయలేకపోయినా, ఆ తర్వాత నమోదు చేసిన రికార్డులు అసాధారణం. సచిన్ తన కెరీర్‌లో 200 టెస్టులాడి 15,921 పరుగులు, 51 సెంచరీలు, 2,058 ఫోర్లతో రెడ్ బాల్ క్రికెట్‌ను ఏలాడు. కేవలం 300 ఇన్నింగ్స్‌లోనే 15,000 టెస్టు పరుగుల మైలురాయిని చేరుకున్న వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు. ఇక వన్డేలలో 22 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్‌ను సాగించిన సచిన్, 1998 క్యాలెండర్ ఇయర్ లోనే 1,894 పరుగులు, 9 సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అలాగే 440 ఇన్నింగ్స్‌లోనే 18,000 వన్డే పరుగులు పూర్తి చేసి అతివేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు. వన్డేల్లో 145 హాఫ్ సెంచరీలు, 2,016 ఫోర్లతో ఎవరికీ అందని ఎత్తులో నిలిచాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తన తండ్రి ఎలా మరణించారో వివరిస్తూ.. బోరున ఏడ్చిన కొడుకు

Allu Arjun: బన్నీని కలవాలని ప్లాన్ చేస్తున్నారా? అప్‌డేట్ తెలుసుకోవాల్సిందే

Loading...
Unable to load recommendations.
Follow Us