ఐపీఎల్ 2027లో ఊహించని మలుపు.. పంజాబ్‌కు హార్దిక్, ముంబయికి అర్ష్‌దీప్

Updated on: Nov 10, 2026 | 4:28 PM

ఐపీఎల్‌ 2027కు ముందు భారీ ఆటగాళ్ల బదిలీ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌ నుంచి పంజాబ్‌ కింగ్స్‌కు, అర్ష్‌దీప్‌ సింగ్‌ పంజాబ్‌ నుంచి ముంబై జట్టుకు మారనున్నట్లు సమాచారం. ఈ ట్రేడ్‌కు సంబంధించిన ప్రాథమిక పత్రాల ప్రక్రియ పూర్తయినట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి అధికారిక ఆమోదం ఇంకా రావాల్సి ఉంది. డిసెంబర్‌ 16న మినీ వేలం జరగనుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్‌కు ముందు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా ట్రేడింగ్‌కు రంగం సిద్ధమైంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్తుండగా, యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబయి ఇండియన్స్ గూటికి చేరనున్నాడు. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ పోటీపడినప్పటికీ పంజాబ్ కింగ్స్ ఈ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ బదిలీకి సంబంధించి ప్రాథమిక పత్రాల ప్రక్రియ పూర్తవ్వగా, బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి అధికారిక ముద్ర వేయాల్సి ఉంది. ఈ ట్రేడ్‌తో ముంబయి ఇండియన్స్‌తో హార్దిక్ పాండ్యాకు ఉన్న రెండో విడత ప్రయాణం ముగియనుంది. 2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబయికి వచ్చి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ, అతని సారథ్యంలో జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. 2024లో అట్టడుగున నిలిచిన ముంబయి, 2026 సీజన్‌లో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు, 2019 నుంచి పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న అర్ష్‌దీప్ సింగ్ నిలకడైన ప్రదర్శనతో టీ20లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి, ఇప్పుడు ముంబయి బౌలింగ్‌కు మరింత బలాన్ని ఇవ్వనున్నాడు. 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టులో వీరిద్దరూ కీలక సభ్యులుగా ఉన్నారు. అయితే హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలు ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుస గాయాల కారణంగా ఐపీఎల్ 2026 తర్వాత అతడు పోటీ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇటీవల షిన్ గాయంతో ఆస్ట్రేలియా-ఏ సిరీస్‌తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి కూడా బరోడా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక పంజాబ్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను జట్టులోనే కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఆటగాళ్ల రిటెన్షన్ గడువును నవంబర్ 17 వరకు పొడిగించగా, డిసెంబర్ 16న గోవాలో ఐపీఎల్ 2027 మినీ వేలం జరగనుంది. బీసీసీఐ ఆమోదం లభించిన వెంటనే ఈ భారీ బదిలీపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిలాడీ లేడీలు.. మాటల్లో పెట్టి మాయం చేసారు

హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి

ఆర్టీసీ – మెట్రో ఉమ్మడి పాస్‌ ధర భారీగా తగ్గింపు

నిరుద్యోగ యువతకు.. గుడ్‌న్యూస్‌

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. మరో 2 కొత్త ఎయిర్‌పోర్టులకు గ్రీన్ సిగ్నల్

Loading...
Unable to load recommendations.
Follow Us