సంజూ శాంసన్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు!

Updated on: Sep 25, 2026 | 10:27 PM

సంజూ శాంసన్‌ను ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లో పక్కన పెట్టి వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం తన కోచింగ్‌ కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయమని గౌతమ్‌ గంభీర్‌ తెలిపారు. ఆ నిర్ణయం తీసుకున్న రాత్రి తాను నిద్రపోలేదని చెప్పారు. జట్టు సమతుల్యత, వైభవ్‌ ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని సంజూతో నేరుగా మాట్లాడినట్లు వెల్లడించారు. సోషల్‌ మీడియా చర్చలు కాకుండా జట్టు గెలుపు, సరైన కాంబినేషనే తుది జట్టు ఎంపికకు ఆధారమని గంభీర్‌ స్పష్టం చేశారు.

టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భారత టీ20 జట్టు ఎంపిక మరియు ఆటగాళ్ల నిర్ణయాలపై సంచలన విషయాలు వెల్లడించాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను పక్కన పెట్టి, యువ కిరణం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం తన కోచింగ్ కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయమని పేర్కొన్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న రాత్రి తాను నిద్ర కూడా పోలేదని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూను తొలి మ్యాచ్ తర్వాత తప్పించడం సులభం కాదని, అయితే జట్టు ప్రయోజనాలు, వైభవ్ ఉన్న అద్భుతమైన ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేయాల్సి వచ్చిందని వివరించాడు. ఈ విషయాన్ని సంజూతో నేరుగా మాట్లాడి వివరించానని, అతడు కూడా ఎంతో పరిణతితో స్వీకరించాడని చెప్పాడు. అదే సమయంలో ప్రతి మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కడం సాధ్యం కాదని, ఫామ్‌లో ఉన్నంత మాత్రాన సుదీర్ఘకాలంగా రాణిస్తున్న సీనియర్లను పక్కన పెట్టలేమని యువ ఆటగాడు వైభవ్‌కు స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో జరిగే చర్చలు, బయటి అభిప్రాయాలు తుది జట్టును నిర్ణయించవని గంభీర్ కుండబద్దలు కొట్టాడు. మ్యాచ్ గెలిపించే సామర్థ్యం, జట్టు సమతుల్యత మాత్రమే ఎంపికకు కొలమానాలని తెలిపాడు. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వ లక్షణాలను కొనియాడుతూ.. స్వార్థం లేకుండా జట్టు కోసం ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధపడడమే అయ్యర్ ప్రత్యేకత అని ప్రశంసించాడు. ఒకటి రెండు మ్యాచ్‌ల వైఫల్యాలతో ఆటగాళ్ల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదని, స్థిరమైన ప్రదర్శనకే తమ ప్రాధాన్యమని గంభీర్ స్పష్టం చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pitru Paksha 2026: ఈ ఏడాది పితృపక్షం ప్రారంభమయ్యేది అప్పుడే

ట్రంప్‌-జిన్‌పింగ్‌ భేటీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు

భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్‌.. హైదరాబాదీ ఆవేదన!

బ్యాంకుకు వచ్చేవాళ్లంతా కస్ట్‌మర్లే కాకపోవచ్చు.. తస్మాత్‌ జాగ్రత్త

వాష్‌రూమ్‌లో ఊహించని సీన్‌.. దెబ్బకు కళ్లు బైర్లు

Loading...
Unable to load recommendations.
Follow Us