వయసుతో మీకేం పని? వైభవ్ సూర్యవంశీపై బ్రెట్ లీ ప్రశంసలు

Updated on: Aug 11, 2026 | 11:31 AM

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ప్రశంసలు కురిపించాడు. అతడి వయసుపై జరుగుతున్న చర్చలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మైదానంలో చూపిస్తున్న అసాధారణ ప్రతిభనే చూడాలని సూచించాడు. ఐపీఎల్‌లో 29 బంతుల్లో 97 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వైభవ్‌పై భారీ అంచనాలు ఒత్తిడిగా మారకుండా జాగ్రత్తపడాలని, అతడిని స్వేచ్ఛగా ఆడనివ్వాలని లీ సూచించాడు.

కేవలం 15 ఏళ్ల వయసులోనే ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యవంశీ వయసుపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అనవసరమని, మైదానంలో అతడు చూపిస్తున్న అసాధారణ ప్రతిభను మాత్రమే చూడాలని సూచించాడు. భారత్‌కు లభించిన అత్యంత అరుదైన ఆణిముత్యాలలో వైభవ్ ఒకడని, భవిష్యత్తులో అతడు మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తాడని బ్రెట్ లీ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ తన ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రత్యర్థి బౌలర్లు ఎంతటి దిగ్గజాలైనా భయపడకుండా, తనదైన శైలిలో అటాకింగ్ క్రికెట్ ఆడాడు. అద్భుతమైన బ్యాట్ స్పీడ్, వైవిధ్యమైన షాట్లతో వేగంగా పరుగులు సాధించి టోర్నమెంట్‌లో అత్యంత చర్చనీయాంశమైన ప్లేయర్‌గా నిలిచాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ల వేగాన్ని తట్టుకుని సాధించిన 97 పరుగుల ఇన్నింగ్స్‌ను బ్రెట్ లీ ప్రత్యేకంగా కొనియాడాడు. అతడి వద్ద సరైన క్రికెటింగ్ షాట్లతో పాటు అద్భుతమైన పవర్ కూడా ఉందన్నాడు. ఐపీఎల్ ప్రదర్శనలతో భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సిరీస్‌లో కాస్త నెమ్మదించినా, ఆ తర్వాత జరిగిన జింబాబ్వే పర్యటనలో చెలరేగిపోయాడు. ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సొంతం చేసుకుని తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ వయసు వివాదంపై బ్రెట్ లీ స్పందిస్తూ.. అతనికి 15 ఏళ్లే అయినా లేదా 17, 18 ఏళ్లు ఉన్నా అతడి ప్రతిభ మారదని, క్రికెట్ మైదానంలో ఆ ఆటగాడు పరుగులు ఎలా సాధిస్తున్నాడనేదే ముఖ్యమని తేల్చిచెప్పాడు. సూర్యవంశీకి వచ్చిన వేగవంతమైన గుర్తింపుతో పాటు భారీ అంచనాలు కూడా ఏర్పడుతున్నాయని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. అయితే అవే అతనిపై ఒత్తిడిగా మారకుండా జాగ్రత్తపడాలని సూచించాడు. అతన్ని చిన్నపిల్లాడిలాగే ఉండనివ్వండి.. అతనిపై ఎక్కువ ఒత్తిడి పెట్టవద్దన్నాడు. సూర్యవంశీకి తాను బౌలింగ్ చేయాల్సి వస్తే షార్ట్ బంతులతో అతడిని పరీక్షించేవాడినని బ్రెట్ లీ చెప్పాడు. యువ బ్యాటర్ హుక్ లేదా పుల్ షాట్‌తో సిక్స్ కొట్టినా, అది తనకు మరింత ఆసక్తికరమైన పోటీగా మారుతుందనన్నాడు. సూర్యవంశీ ప్రతిభను సవాలు చేసే అవకాశం తనకు ఎంతో నచ్చేదని లీ తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు

సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్‌లో పెరగనున్న ధరలు!

అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్‌ చేసిన డ్రైవర్‌, కండక్టర్‌.. ఆ తర్వాత

అల్లు అర్జున్ X షారూఖ్ ఖాన్? కానీ ఊహించని ట్విస్ట్ ఉంది!

Loading...
Unable to load recommendations.
Follow Us