Football Player: ఫుట్‌బాల్‌ మ్యాచ్ జరుగుతుండగా పిడుగు.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిన ప్లేయర్‌

|

Feb 13, 2024 | 6:10 PM

కారు ప్రమాదం ప్రపంచరికార్డ్‌ సాధించిన ఒక అథ్లెట్‌ను బలితీసుకుంటే.. పిడుగుపాటు మరో ఫుట్‌బాల్‌ ప్లేయర్ మృతికి కారణమైంది. ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్ లో పిడుగుపడింది. దీంతో మ్యాచ్ ఆడుతున్న ఓ ప్లేయర్ నిలుచున్న చోటే కుప్పకూలిపోయాడు. క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటన అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఫిబ్రవరి 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కారు ప్రమాదం ప్రపంచరికార్డ్‌ సాధించిన ఒక అథ్లెట్‌ను బలితీసుకుంటే.. పిడుగుపాటు మరో ఫుట్‌బాల్‌ ప్లేయర్ మృతికి కారణమైంది. ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్ లో పిడుగుపడింది. దీంతో మ్యాచ్ ఆడుతున్న ఓ ప్లేయర్ నిలుచున్న చోటే కుప్పకూలిపోయాడు. క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటన అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఫిబ్రవరి 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటి వరకు ఉత్సాహంగా ఆడుతూ తమ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సహచరుడు క్షణాలలో నిర్జీవంగా మారిపోవడంతో తోటి ప్లేయర్లు షాకయ్యారు. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు కాసేపటి వరకు ఏం జరిగిందో తెలియలేదు. పిడుగు పడి ప్లేయర్ చనిపోయాడని తెలియగానే ఆ ప్రాంగణమంతా విషాదంతో నిండిపోయింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఆదివారం ఎఫ్ సీ బాండుంగ్, ఎఫ్ బీఐ సుబాంగ్ జట్ల మధ్య వెస్ట్ జావాలోని సిలివాంగి స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా గోల్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో గ్రౌండ్ లో నడుచుకుంటూ వెళుతున్న ఓ ప్లేయర్ పై పిడుగు పడింది. నిలువునా కుప్పకూలిన సహచరుడి దగ్గరికి మిగతా ప్లేయర్లు పరుగెత్తుకెళ్లారు. సీపీఆర్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతణ్ణి పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..