‘అమ్మాయిని నమ్మి మోసపోయా’ రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో!
షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ నేరాల వెనుక భారీ అప్పులు, జూదం, డ్రగ్స్ వ్యసనం, విడాకుల వివాదమే కారణమని పోలీసులు గుర్తించారు. తన భార్య సరిత, ఇద్దరు పిల్లలతో పాటు మరో నలుగురిని దారుణంగా హత్య చేసిన రాజ్‌కుమార్, హత్యలకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోలో తనను మోసం చేశారని ఆరోపించాడు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన షాబాద్ ఆరు హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఉన్మాదానికి వెనుక భయంకరమైన అప్పులు, విడాకుల వివాదమే ప్రధాన కారణాలని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.ట్యూషన్ టీచర్ సరితను బలవంతంగా పెళ్లాడిన రాజ్‌కుమార్, ఆ తర్వాత జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో రెండు కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశాడు. కొడుకు ఆత్మహత్య డ్రామాలకు భయపడి తల్లిదండ్రులు తమ ఆస్తులన్నీ అమ్మేసినా, రాజ్‌కుమార్ ప్రవర్తనలో మార్పు రాలేదు. డ్రగ్స్‌కు బానిసైన అతడు నిత్యం మద్యం తాగి భార్య సరితను హింసించేవాడు. రోజురోజుకూ పెరుగుతున్న వేధింపులను భరించలేక సరిత విడాకులు కోరడంతో, రాజ్‌కుమార్ ఆమెతో పాటు తన ఇద్దరు పిల్లలను కూడా దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను కూడా హతమార్చాడు. హత్యలకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోలో తనను మోసం చేశారని ఆరోపించినప్పటికీ, బాధితుల కుటుంబ సభ్యులు అతని ఆరోపణలను ఖండించారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్