సాధారణ తనిఖీలు.. ఓ వాహనంలో 3 అనుమానాస్పద బ్యాగులు.. తెరిచి చూడగా కళ్లు చెదిరే.!

|

Apr 03, 2024 | 1:24 PM

తెలంగాణలోనూ భారీగా నగదు పట్టుపడుతోంది. తాజాగా పాతబస్తీలోని ఛత్రినాఖ పీఎస్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. దారుసలాం ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వాహనంలో అనుమానాస్పదంగా 3 బ్యాగులు కనిపించాయి. వాటిని చెక్‌ చేయగా అందులో కోటిన్నర నగదును గుర్తించారు.

తెలంగాణలోనూ భారీగా నగదు పట్టుపడుతోంది. తాజాగా పాతబస్తీలోని ఛత్రినాఖ పీఎస్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. దారుసలాం ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వాహనంలో అనుమానాస్పదంగా 3 బ్యాగులు కనిపించాయి. వాటిని చెక్‌ చేయగా అందులో కోటిన్నర నగదును గుర్తించారు. ఆ నగదుకు సంబంధించి సదరు వ్యక్తులను విచారించగా వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదు తరలిస్తున్న రవిచంద్ర, సురేష్‌, శ్రీనివాస్‌ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యాష్‌ సీజ్‌ చేసి ఐటి అధికారులకు అప్పగించారు. మరోచోట, కుల్సంపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పురానాపూల్ ఎక్స్ రోడ్స్ వద్ద వాహనాల తనిఖీలు చేసిన పోలీసులు ఆధారాలు లేని రూ.10 లక్షల నగదును సీజ్‌ చేశారు. జావీద్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Follow us on